* శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది
* మనుషులకు నిత్యం ఉత్సాహాన్ని ఇస్తుంది
* కార్పోరేట్ హొటళ్ల మెనూలో చద్దన్నమే అగ్రం

శంఖవరం, 16 మే 201.
————————————
పెద్దల మాట చద్దన్నం మూట. మన ఈ తెలుగు సామెత తెలుగు నాట అందరికీ సుపరిచితమే.
పెద్దలు ఎప్పుడూ మంచే చెబుతారన్నది దాని సారాంశం. పూర్వ కాలంలో అందరూ ఉదయాన్నే చద్దన్నమే తినేవారు. రాత్రి వండి తినగా మిగిలిన
అన్నాన్ని దాని గంజి నీటితో కలిపి అచ్చంగా అలాగే పులియ బెట్టేవారు కొందరు ఐతే , మరి కొందరు దానిలో దబ్బ లేదా నిమ్మ ఆకును వేసి రాత్రంతా అలా ఉంచి పులియబెట్టే వారు మరి కోందరు. ఈ చద్దిని ఉదయాన్నే తింటారు. ఇంకొందరు చద్దన్నంలో పెరుగును గాని మజ్జిగను కలుపుకుని తింటారు. మరి కొందరు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటూ ఆ చద్దన్నంతో పాటు ఉల్లి పాయను కానీ, పచ్చి మిరప కాయను, ఆవకాయ తదితర పచ్చళ్ళను నంజుకుంటారు. రైతన్నలు, వ్యవసాయ కూలీలు కొందరు చద్దన్నాన్ని ఇంటి వద్దే తిని పొలాలకు వెళితే మరి కొందరు చద్దన్నం మూటను పొలాలకు తీసుకు వెళ్ళి ఉదయం 9 గంటలకు తింటుంటారు. ఈ పులిసిన అన్నం తిన్న వారికి పులికి ఉన్నంత బలం వస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ చద్దన్నం ఆహార పదార్థాన్ని తినడం తరతరాల మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానంలో అంతర్భాగమై అగ్ర తాంబూలం అందుకొంది. ఒకప్పుడు పల్లె నాగరికత చరిత్రలో బ్రేక్ ఫాస్ట్ అంటే చద్దన్నమే. ఆ తర్వాతే తరాలు మారే కొద్ది మన ఉదయం పూట ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. జనుల జిహ్వ చాపల్యానికి అనుగుణంగా కొత్త కొత్త వంటకాలు, ఆహార పదార్థాలు ఉదయం పూట చద్దన్నం స్థానాన్ని ఆక్రమించించాయి. ఐనప్పటికీ చద్దన్నం వినియోగం, ప్రాధాన్యం నేటికీ ఏమాత్రం తగ్గలేదు.

చద్దన్నంపై ప్రపంచ వ్యాప్త చర్చ …

ఇటీవల కాలంలో తాజాగా దేశ వ్యాప్తంగా చద్దన్నం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. దేశంలో కరోనా వ్యాధి కరాళ నృత్యం చేస్తోన్న వేళ చద్దన్నానికి విపరీతంగా ప్రాధాన్యం పెరిగింది. కరోనాను ఎదుర్కోవాలంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని అందరికీ తెలిసిందే. అంతే తప్ప ఏ మందు అదుపు చేయలేవని అనేక అంశాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి వ్యాధి నిరోధక శక్తి ఎందులో వుంటుందోనని అన్వేషణ చేసారు. ఫలితంగా పల్లెటూరి ప్రజలు రోజూ ఉదయం పూట తీసుకునే చద్దన్నంలో ఈ వ్యాధి నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుందని అమెరికన్ శాస్తవేత్తలు నిర్ధారించారు.

చద్దన్నంలో పోషకాలు, మేలులు ఇవే …

చద్దన్నాన్ని ఓ రాత్రంతా పులియ బెట్టినప్పుడు అందులో చేరిన బ్యాక్టీరియా అన్నంలోని పోషకాలతో చర్య పొందడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాల శాతం పెరుగు తుంది. మామూలు అన్నంతో పోలిస్తే పులియ బెట్టిన అన్నంలో ఐరన్‌ 21 శాతం ఎక్కువ. దీన్ని క్రమం తప్పకుండా తినేవాళ్లలో బి 12 విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. దీంతో పల్లెటూరి ఉదయం పూట ఆహారం చద్దన్నంపై మరోసారి చర్చ జరుగుతోంది. మనం నిత్యం తీసుకునే ఆహారంలో చిన్న పాటి మార్పులు చేసుకుని చద్దన్నం తినడం ద్వారా ఆరోగ్యాన్ని పెంచు కోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది పోషకాల పరంగా ఎంతో మంచిది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తినిస పెంచుతుంది. ఉత్సాహంగా ఉంచుతుంది. వడ దెబ్బ నుంచి రక్షిస్తుంది. జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాల్ని హరిస్తుంది. మతి మరుపు, ఆల్జీమర్స్‌, బుద్ధిమాంద్యం వంటి సమస్యల్ని నిలువరిస్తుంది. అలసటకు గురికాకుండా చూస్తుంది. రక్త హీనత లేకుండా చేస్తుంది. శరీరానికి అవసరమైన కాల్షియం అందిస్తూ దంతాలూ, ఎముకలూ దృఢంగా ఉండేలా చేస్తుంది. అల్సర్లూ, పేగు సమస్యలను తలెత్తనీయదు. అధిక రక్తపోటు, మలబద్ధక సమస్యలు దూరమవుతాయి. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి అందిస్తుంది. వడ దెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని నివారిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు బలం కలుగుతుంది. చద్దన్నంలో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

చద్దన్నం కరోనా నివారణా ఉపకారి ….

ఇది బలవర్థకమైన ఆహారమనీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుందనీ, ఇన్ని సుగుణాలు ఉన్న చద్దన్నం కరోనా నివారణకు దివ్యౌషధంగా పని చేస్తుందని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పులిసిన మజ్జిగ కలిపిన చద్దన్నంలోని బ్యాక్టీరియా కరోనాతో యుద్ధం చేస్తుందని చెబుతున్నారు. చద్దన్నం గొప్పతనం భారతదేశ మంతటా వ్యాపించింది. అమెరికన్‌ న్యూట్రిషన్‌ అసోసియేషన్‌ ఇందులోని ఉపయోగాల్ని పేర్కొనడంతో మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చి ఏకంగా స్టార్‌ హోటళ్లు, అంతర్జాల ఆహార వ్యాపారం విపణి మెనూలోనూ చేరింది. దాంతో ఆధునిక షెఫ్‌లు పెరుగు, పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు, ఆవకాయ, దబ్బకాయ పచ్చళ్ళను జోడించి చద్దన్నాన్ని వడ్డిస్తున్నారు. ఇది డిష్ రూ. 630 వరకూ ఉంది. ఏదేమైనా కరోనాను ఎదుర్కొనేందుకు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదని, నిత్యం చద్దన్నం తింటే కొంతలో కొంత పరిస్థితి మెరుగౌతుందని ఆహార నిపుణులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *