ఓ మహిళ వేడుకోలు

గుర్రాజుపేట, 17 మే 2021
——————-‌‌‌———————–
మా భూమిని మాకే ఇవ్వండి మహా ప్రభో… అంటూ పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు తదితరులతో పాటు చివరకు న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన ఓ మహిళ దీన గాధ ఇది.

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని విషయమిది. గుడివాడ రెవిన్యూ పరిధిలోని గుర్రాజుపేట గ్రామంలోని సర్వే నెంబర్లు 123 -1, 123 -2, 123 -4 లో 1.10 ఎకరాల భూమిని డాక్యుమెంట్ నెం.198 / 1967 ద్వారా కొర్ని పెదఅప్పన్న 1967 సంవత్సరంలో కొనుగోలు చేశారు. అతని మరణాంతరం ఈ భూమిని అతని భార్య, కుమార్తె పక్కుర్తి అప్పయమ్మ, ముగ్గురు కుమారులు బుచ్చన్న (అనే రాజశేఖర్), అప్పారావు, నూకరాజు కలపి 14.10.1985 న నక్కపల్లి రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించు కున్నారు. వీరిలో పక్కుర్తి అప్పయమ్మ 01.12.2001 న మరణించగా ఈమె ఏకైక వారసురాలైన కుమార్తె ఈగల బంగారు పాప జామాయిల్ తోట వేసుకొని అనుభవిస్తు ఉన్నారు. గ్రామానికి ఆనుకొని ఉన్న బంగారు పాపకు చెందిన ఈ విలువైన భూమిపై కన్నేసిన వైస్సార్ పార్టీ నాయకుడు కొర్ని బుచ్చన్న కుమారుడైన కొర్ని రాజా రమేష్ 2015 లో రాత్రికి రాత్రే ఆ భూమిలో రేకుల షెడ్ వేసి ఆక్రమించాడు. దీనితో భూ యజమానులైన ఈగల బంగారుపాప, పోలీసులకు పిర్యాదు చేయగా అప్పుడు పోలీసులు రాజా రమేష్ పై కేసు నమోదు చేయడం చేసారు. అనంతరం రాజా రమేష్ తప్పుడు పత్రాలతో ఎలమంచిలి కోర్టులో వేసిన కేసు ప్రస్తుతం కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా ఈ భూమికి పాస్ బుక్స్ కొరకు ఎప్పటి నుండో రెవిన్యూ అధికారుల చుట్టూ బంగారు పాప తిరుగు తుండగా ఈ భూమిని ఇళ్ల స్థలాల కొరకు ప్రభుత్వం తీసుకున్నదని తెలుపు తున్నారు. ఈ జిరాయితీ భూమిని ఇళ్ల పట్టాల కొరకు తీసుకుని ఉంటే పరిహారాన్ని ప్రభుత్వం బంగారు పాపకు చెల్లించిన దాఖలాలు లేవు. ప్రారంభం నుండి ప్రభుత్వ భూమి అయితే 2 పర్యాయాలు రిజిస్ట్రేషన్ ఏవిధంగా జరిగిందని ఆమె ప్రశ్నిస్తున్నారు. గెజిట్ ప్రకారం సర్వే నెంబర్లు 123-1, 123-2, 123-4 డ్రై ల్యాండ్ గా మాత్రమే ఉండగా ఏ విధంగా ప్రభుత్వ భూమిగా నమోదు అయినదో తేలవలసి ఉన్నది. ఈ ఎకరా భూమి ప్రస్తుతం1బి లో చెరువు భూమి గాను, రెవిన్యూ ఫైనల్ గజిట్ 2018, 22ఎ ప్రకారం ఎస్.డబ్ల్యు,(ఎల్.ఏ), బి.సి.కాలనీకి చెందిన ప్రభుత్వ భూమి గాను వేరు, వేరుగా చూపడంలో ఉన్న మతలబు ఏంటో అధికారులు తెలుప వలసి ఉన్నది. ఇప్పుడు ఏకంగా ఈ భూమిని ఆక్రమించు కొని స్లాబ్ ఇళ్ళు నిర్మాణం చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో, మిగిలి ఉన్న భూమిని కూడా కోర్టులో కేసు ఉన్నా, ప్రభుత్వ భూమిగా రెవిన్యూ రికార్డులలో ఉంటేమి అని కొన్ధ రాజా రమేష్ ఈ భూమిని అమ్ముకుంటూ ఉన్నాడు. మిగిలిన స్థలములో కొద్ధి భాగం కొర్ని తాతబ్బాయికి అమ్మగా అతడు ఇంటి నిర్మాణంకు పునాదులు తీస్తుoడగా, ఈగల బంగారు పాప యస్.రాయవరం పోలీసులకు ఇటీవల పిర్యాదు చేసారు. దీనిపై ఎస్.ఐ, వి.చక్రధరరావు, యస్.రాయవరం సత్యనారాయణకు పంపడం జరిగింది. దీనిపై తహశీల్దార్, యస్.రాయవరం రికార్డులను పరిశీలిస్తు ఉన్నామని, ప్రస్తుతం ఎవ్వరినీ ఈ భూమిలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అక్రమంగా నిర్మించినట్లు తేలితే, అక్రమ నిర్మాణాలు తొలగింపునకు చట్టరీత్యా చర్యలు చేపడతామని తహశీల్దార్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *