ఏలేశ్వరం, 18 మే 2021
————————————-
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఓ వ్యక్తి మరణం అనుమానాస్పద మైంది. ఏలేరు ఎడమ కాలువ దగ్గరలో మూత పడిన ఓ క్వారీ ప్రాంత పరిసరాలలో పొదల మధ్య వ్యక్తి మృత దేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. అతను స్థానిక చైతన్య నగర్ కాలనీకి చెందిన గెద్దాడ శివ (45)గా పోలీసులు నిర్ధారించారు. ఇతను ఓ చెట్టు కొమ్మకు గుడ్డ కొసను కట్టి రెండో కొసతో తన మెడ చుట్టూ బిగించుకొని మరణించిన స్థితిలో మృత దేహం చెట్టు కొమ్మకు వేలాడు తోంది. ఇది నిజంగా ఆత్మ హత్య, లేక ఎవరైనా చేసిన హత్యా, ఈ దుర్మరణాని కారణాలు ఏంటనేది ప్రస్తుతానికి సందేహాలుగా మిగిలాయి. వాస్తవం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. శవ పరీక్షల నిమిత్తం మృత దేహాన్ని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సంపత్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *