పెనుగొల్లు , 20 మే 2021
—————————————-
పేరుకే ఆయన ఇంటి పేరు బంగారి. ఆయన వంటి పేరు నూకరాజు. నిజానికి ఆయన పేరులో ఉన్న బంగారం, రాజు గొప్పతనం ఆయన మనస్సులో మచ్చుకు కూడా కనబడదు. ఆయన మనస్సు ఓ అక్రమాల పుట్ట. కనిపిస్తే శ్మశానం ఖాళీగానే ఉన్నది కదాని కబ్జా చేసేస్తాడు. ఆయన అంత గొప్ప మనిషి.

విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట నియోజకవర్గం యస్.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామ రెవిన్యూ పరిధిలో దళితులు
శ్మశాన వాటికను ఫెన్సిoగ్ వేసి ఆక్రమించేశారు. ఈ గ్రామంలో నివాసం ఉంటున్న మాల, అరుంధతీ సామాజిక వర్గీయులు సుమారు 300 కుటుంబాలు దళిత కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి జాతీయ రహదారి నుండి వమ్మవరం పోవు తారు రోడ్డును ఆనుకొని ఎడమ వైపున వరహా నదికి మధ్య ఉన్న స్థలంలో ఒకే ఒక్క ఉమ్మడి స్మశాన నాటిక ఉంది. ఇప్పటికే ఇది వరహా నదిలో ఇసుక అక్రమ త్రవ్వకాల వలన, నదికి వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహం వలన దిశ మారిన శ్మశాన వాటిక నది గర్భంలో కలిసి పోయి కుచించుకు పోతోంది. ఈ స్మశాన వాటిక తారు రోడ్డును ఆనుకొని ఉన్నందున విలువైన భూమిగా జమున కట్టాడు. వెంటనే దానిపై కన్ను పడి ఆక్రమణలకు పూనుకున్నాడు. ఇదేమి పని అని నిలదీస్తే తిరిగి దళితులపై దౌర్జన్యానికి దిగు తున్నాడు. స్మశాన వాటికకు ఫెన్సింగ్ వేసి శాశ్వతంగా ఆక్రమణకు పూను కున్నాడు. ప్రస్తుతం తమ జనాభా అవసరాలకు తగ్గట్టుగా శ్మశాన వాటిక సరిపోవడం లేదని ఒక ప్రక్క ఆందోళన చెందుతుoటే, మరో ప్రక్క నది గర్భంలో కలిసిపోయి ఇబ్బందులు పడుతుంటే, పులి మీద పుట్రలా ఇప్పుడు నూకరాజు ఆక్రమణ తోడైనదని దళితులు వాపోతున్నారు. ఇప్పటి కైనా తహశీల్దార్ స్పందించి సర్వే చేయించి ఆక్రమణలు తొలగించి, తమ శ్మశాన వాటికకు హద్దులు నిర్ణయించి శాశ్వతంగా పరిష్కరించి న్యాయం చేయాలని దళితులు కోరుతూ సుమారు 100 మంది తహశీల్దార్ కు పిర్యాదు చేయడం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *