పెనుగొల్లు, 22 మే 2021
————————————-
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం మండలంలోని పెనుగొల్లు గ్రామ దళితుల శ్మశాన నాటిక ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ రుద్రభూమికి బంగారి నూకరాజు పెన్సిoగ్ వేసి ఆక్రమించు కొన్నoదున, ఆక్రమణలు తొలగించి న్యాయం చేయాలని దళితులు తహశీల్దార్ కు పిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్ బి.సత్యనారాయణ స్పందించి ఆ కైలాస భూమిని సర్వే చేసి ఆక్రమణలు ఉంటే తొలగించాలని తన సిబ్బందిని శుక్రవారం ఆదేశించారు. తాహశీల్దార్ ఆదేశాలపై సర్వేయర్ టి.రామారావు, పెనుగొల్లు విఆర్వో ఎం.ఎన్. అప్పారావు, విఆర్ఐ సి.హెచ్.లక్ష్మి, గ్రామ సచివాలయ సర్వేయర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు వెళ్లి శ్మశానాన్ని సర్వే చేసారు. శ్మశాన వాటికను బంగారి నూకరాజు అక్రమించినట్లు గుర్తించి, వేసిన పెన్సింగ్ సిమెంట్ పోల్స్ అన్నిటినీ తొలగించారు. మరొకసారి ఆక్రమణలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు చేపడతామని ఈ సoదర్భంగా హెచ్చరించారు. దీనితో ఇప్పటికైనా తహశీల్దార్ సత్యనారాయణ స్పందించి, సర్వే చేయించి ఆక్రమణలు తొలగించి, తమ శ్మశాన వాటికకు హద్దులు నిర్ణయించి, స్థిరీకరించి సమస్యలు రాకుండా పరిష్కరించి న్యాయం చేసినందుకు రెవెన్యూ అధికారుల బృందానికి దళితులు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *