శంఖవరం , 23 మే 2021

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని అందరు ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యోగులకు మొదటి డోసు కరోనా నివారణ టీకాలను రేపు (సోమవారం) వేస్తున్నట్టు శంఖవరం ఎంపీడీవో. జె.రాంబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. టీకాలను వేసుకోగోరే ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యోగులు అందరూ తప్పని సరిగా తమ గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు, వారి ఫోన్ నంబర్లలో సహా శంఖవరం లోని జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలోని ప్రత్యేక కరోనా టీకా కేంద్రానికి సోమవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు. వచ్చిన వెంటనే తమ పేర్లను అంతర్జాలంలో నమోదు చేయించు కోవాలని, తదుపరి లబ్దిదారులకు ఎరుపు రంగు గుర్తింపు బిళ్లను అందించడంతో టీకాల ప్రక్రియ మొదలవు తుందన్నారు. అర్హులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం, ప్రైవేటు ఉద్యోగులకు ఎంపీడీవో. రాంబాబు పిలుపును ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *