యస్.రాయవరం, 23 మే 2021
———————————————–
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గంలోని యస్.రాయవరంలో ఇండియన్ గ్యాస్ సిలెండర్లు పంపిణీ వద్ద వినియోగదారులు ప్రస్తుత కరోనా సమయంలో కనీస జాగ్రత్తలు పాటించక పోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందు తున్నారు. స్థానిక పోలీసు స్టేషన్ కు కూత వేటు దూరంలో నూకాంబికా అమ్మవారి గుడికి ఎదురుగా, ఆర్టీసీ బస్ స్టాప్ వద్ద ఉన్న స్థలంలో సిలెండర్లు తీసుకొనే సమయంలో కనీస కరోనా జాగ్రత్తలు పాటించటం లేదు. కరోనా రెండవ వేవ్ విజృంభించి ప్రతీ గ్రామంలోను ప్రజలు రోజూ పిట్టల్లా రాలి పోతున్నారు. ఐనప్పటికీ వినియోగదారులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ, శానిటైజర్ వాడకుండా, కొందరు మాస్క్ లు లేకుండా, కనీస దూరం పాటించకుండా సిలెండర్ల కోసం ఒకరిపై ఒకరు పడడం కనిపిస్తున్నది. వీరు భాద్యత లేకుండా వ్యహరించడం పట్ల ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పరిస్థితిని
యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *