పెదగుమ్ములూరు, 24 మే 2021
———————————————-
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం యస్.రాయవరం మండలంలోని పెదగుమ్ములూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని 216 సర్వే నెంబర్లోని పూరా విస్తీర్ణం 21.68 ఎకాల విస్తీర్ణం భూమిలో ఎర్ర చెరువు ఉంది. ఈ చెరువు మధ్యలోంచి జాతీయ రహదారిని నిర్మించడంతో ఆ చెరువు భూమి కాస్త మూడు సబ్ డివిజన్లుగా విడిపోయింది. ఇందులో ఓ భాగం దురాక్రమణకు గురైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

216-2 సర్వే నంబర్లోని ఎర్ర చెరువులోని మధ్య భాగంలోని 3.34 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ రహదారి -5 ను నిర్మించారు. దీంతో ఈ చెరువు రోడ్డుకు కుడి, ఎడమలుగా రెండు భాగాలుగా విడిపోయినది. రోడ్డుకు పోను మిగిలిన 18.34 ఎకరాల భూమిలో సర్వే నెంబర్ 216-1లో 16.61 ఎకరాల మేరకు యలమంచిలి నుండి నక్కపల్లి పోవు హైవే రోడ్డుకు కుడి వైపున పెదగుమ్ములూరు గ్రామాన్ని ఆనుకొని ఉన్నది. ఇందులో సర్వే నెంబర్ 216-1/1లో వాటర్ ప్లాంట్ కు 0.03 సెంట్లు, 216 -1/2 లో శివాలయంనకు 0.10 సెంట్లు, మొత్తం 0.13 సెంట్లు భూమి రెవెన్యూ ఫైనల్ గజిట్ 22 ఏ ప్రకారం కేటాయిoచినది పోను మిగతా 16.48 ఎకరాల భూమి రెవిన్యూ రికార్డుల ప్రకారం ఉండవలసి ఉండగా అందులో చాలా భాగం అక్రమార్కులు అక్రమించుకున్నారు.

ఇక మిగిలిన చెరువు భాగం 216-3 సర్వే నెంబర్లో 1.73 ఎకరా భూమి నేషనల్ హైవేకు ఎడమ వైపు తిమ్మాపురం గ్రామంను ఆనుకొని ఉన్నది. ఇందులో సర్వే నెంబర్ 216-3/1 లో సర్కిల్ పోలీస్ కార్యాలయంనకు 0.20 సెంట్లు, 216-3/2 లో 0.03 సెంట్లు వాటర్ ట్యాంక్ కు మొత్తం 0.23 సెంట్లు భూమి కేటాయించినట్లు రెవిన్యూ ఫైనల్ గజిట్ 2 2ఏ ద్వారా తెలుస్తున్నది. దీనితో 0.23 సెంట్లు పోగా ఎకరాలు1.50 సెంట్లు భూమి నేషనల్ హైవేను ఆనుకొని తూర్పు వైపున, సర్కిల్ పోలీస్ కార్యాలయం కు ఉత్తరం వైపున ప్రభుత్వ ఎర్ర చెరువు ఉండవలసిన ఉన్నది. అయితే సర్వే నెంబర్ 218-2 లో ఉన్న ఎకరా 1.76 సెంట్లు జిరాయతి భూమిని ఇటీవల యస్.రాయవరంనకు చెందిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొనుగోలు చేసి 14 ఫ్లాట్ లు గా చేసినట్లు తెలిసినది. ఈ ప్లాట్లు వేసిన నాయకుడు ఎర్రచెరువు సర్వే నెంబర్ 216-3 లో ఉన్న ఎకరా 1.50 సెంట్లలో కొద్ది భాగాన్ని ఆక్రమించి ప్లాట్లుగా వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమదారుడు హైవే రోడ్డును ఆనుకొని సిమెంట్ తూరలు వేసి వెనుక ఉన్న ప్లాటుల భూమికి నూతనంగా అక్రమంగా దారి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరి కళ్ళ ఎదుటే ప్రభుత్వ భూమిని అక్రమించు కుంటుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసింది పోయి తమకు పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. నేషనల్ హైవే ఆనుకొని కోట్ల రూపాయల విలువైన భూమి కావడంతో అక్రమార్కులతో కుమ్మక్కై భారీగా ఆర్థిక ప్రయోజనాలు ఆశించినట్లుగాను అందుకే సంబంధిత అధికారులు ఆక్రమమణ వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వెల్లు వెత్తు తున్నాయి. చెరువులు, వాగులను ఆక్రమించి ఎటువంటి నిర్మాణములు చేపట్ట కూడదన్న అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.

కాబట్టి సంబంధిత జలవనరుల శాఖ అధికారులు, పంచాయతీ అధికారుల సమక్షంలో, రెవిన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి హద్దులు నిర్ణయించి, ఆక్రమణలు తొలగించి, విలువైన ప్రభుత్వ ఆస్తులు కాపాడి, తద్వారా ఇరు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని, గ్రామ సరిహద్దులో ఉన్నందున ఎర్రచెరువును అభివృద్ధి చేసి, నీటి నిల్వలు పెంచడం ద్వారా భూగర్భ జలాలు పెంచి, రాబోవు కాలంలో ప్రజల తాగు నీటికి, సాగు నీటి అవసరాలు తీర్చాలని సంబంధిత శాఖల అధికారులను యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్
సోమిరెడ్డి రాజు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *