ఆలమూరు, 25 మే 2021
—————————————                      
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు శాసనసభ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన  ఆలమూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా చింతలూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది నామాల శ్రీనివాస్ మంగళవారం నియమితులు అయ్యారు. ఈయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయ శాఖ విభాగం, అసెంబ్లీ వ్యవహారాల కమిటీ కార్యదర్శి వి.సునీత ఉత్తర్వులు జారీచేశారు. తన కోర్టు పరిధిలోని ప్రజలందరికీ న్యాయ పరంగా అత్యుత్తమమైన సేవలు అందిస్తానని, నిష్పక్ష పాతంగా వ్యవహరిస్తానని, పేద కక్ష్యిదారులకు అండగా ఉంటానని మీడియా ద్వారా ప్రజలకు ఏజీపీ శ్రీనివాస్ హామీని ఇచ్చారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *