గుర్రాజుపేట, 25 మే 2021
————————————
అతను జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగి. అతను తలచుకుంటే రాత్రికి రాత్రి పరుల భూములను సునాయాసంగా ఆక్రమించ గలడు. ఆ భూమిలో రేకుల షెడ్డును నిర్మించ గలడు. ఇంకా కొన్ని కొబ్బరి మొక్కలను కూడా నాటేయ గలడు. ఆ భూముల ఫూర్వపు ఆనవాళ్లు, రూపు రేఖలు మార్చేయగలడు.

విశాఖపట్నం జిల్లా యస్.రాయవరం మండలం గుడివాడ శివారు గుర్రాజుపేట గ్రామంలో పాస్ బుక్స్, రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉండి సంపూర్ణ స్వాధీన హక్కు భుక్తమైన ఓ మహిళ ఈగల బంగారుపాప భూమిపై వరప్రసాద్ కన్నేసాడు. రాత్రికి రాత్రి షెడ్ను నిర్మించాడు. కొబ్బరి మొక్కలు పాతేసాడు. ఆపై దురాక్రమణకు పాల్పడ్డాడు. ఈ నేపధ్యంలో తాహశీల్దార్, పోలీసులకు బంగారు పాప ఫిర్యాదు చేసింది. అనంతరం విలేకరులకు వివరాలను తెలిపింది. గుర్రాజుపేట గ్రామస్తురాలైన ఈగల బంగారు పాపకు ఇదే గ్రామంలో భూములు కలవు. పక్కుర్తి అప్పయమ్మ భర్త అప్పారావు తన ఏకైక కుమార్తెతో వ్యవసాయం చేసుకొని జీవించేది. 25.01.1994 న అప్పయమ్మ తన కుమార్తె బంగారుపాప పేరున పల్లం ఎకరా 1.00 భూమి సర్వే నెంబర్ 201-1 లో 0.25 సెంట్లు, 201-3 లో 0.25 సెంట్లు, 202-9 లో 0.25 సెంట్లు, 202-12 లో వెరసి మొత్తం ఎకరా 1.00 గుడివాడ గ్రామస్తురాలైన గొంప అప్పారావు భార్య సింహాచలం వద్ద నక్కపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్ 60/1994 గా బంగారుపాప పేరున కొనుగోలు చేసినది. ఈ భూమిని సింహాచలం 25.06.1975 దాట్ల వెంకట పతిరాజు వగైరాల వద్ద డాక్యుమెంట్ నెంబర్ 2702/1975 గా కొనుగోలు చేసినదిగా పేర్కొన్నారు. ఈ భూమి బంగారుపాప పేరున ఖాతా నెంబర్ 1169 గా రెవిన్యూ రికార్డులలో కూడా నమోదు చేసి, పాస్ బుక్స్, టైటిల్ డీడ్ నెంబర్ 592685 గా రెవిన్యూ అధికారులు ఇచ్చారు. అనంతరం తల్లి అప్పయమ్మ 2001లో మరణించగా 2002 లో అదే గ్రామ వాసి ఈగల నాగేశ్వరరావుతో వివాహం అయినది. తల్లి ద్వారా సంక్రమించిన ఇతర భూములు, ఈ భూమి సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన బంగారు పాప తల్లికి స్వయానా సోదరుడైన కొర్ని అప్పారావు కుమారుడు బంగారుపాప మేనమామ కుమారుడు అయిన వరప్రసాద్ కాకినాడ టౌన్ కోర్టు కాంప్లెక్స్ లో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగి. ఈయన తన భూమిని అక్రమ మార్గంలో పొందడానికి కుయుక్తులు పన్నాడని బంగారు పాప తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *