(ఈఎన్ఎస్.బాలు సహకారంతో…)

శంఖవరం – జనాసవార్త
———————————–
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ వేక్సినేషన్ సెంటర్ లో గురువారం 512 మందికి కోవీషీల్డ్ ఠీకాలను వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు టీకా శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా టీకాలకు టోకెన్లు జారీ చేసిన తరువాత ఆ వివరాలను అంతర్జాలంలో నమోదు చేసి టీకాలను వేస్తున్నట్లుమమ చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లే సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా బౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతీఒక్కరూ వేక్సినేషన్ కేంద్రానికి వచ్చేటపుడు మాస్కులు విధిగా ధరించాలని సూచించారు. ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. అప్పటికీ ఇబ్బందులు ఉంటే 104 కాల్ సెంటర్ కాల్ చేయడం ద్వారా మెరుగైన వైద్యం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించే వీలుంటుందని చెప్పారు. ఏ పని చేయడానికైనా ముందుగా నాణ్యమై శానిటైజర్లను చేతులకు పూసుకోవాలి అన్నారు. ఆస్పత్రిలో హోమ్ ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నా మన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే కరోనాని నియంత్రించ వచ్చిని డాక్టర్ ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు.


——————————–
( Source enslive.in )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *