* ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
* నలుగురు యువకుల అరెస్టు

బెంగళూరు
—————–
బెంగళూరు నగరంలో బంగ్లాదేశ్ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడింది ఆమె మిత్రులేనని పోలీసులు గుర్తించారు. నిందితులను పోలీసులు అరెస్టుచేసారు. పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. బంగ్లాదేశ్ కు చెందిన యువతి (22) పై పది రోజుల క్రితం ఇద్దరు మహిళల సమక్షంలోనే నలుగురు యువకులు అత్యాచార దుర్మార్గానికి పాల్పడ్డారు. ఈ దురాగతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశారు. బాధిత యువతి కూడా ఈ గ్యాంగ్ లో సభ్యురాలేనని తెలుస్తోంది. విషయం వెలుగులోకి రావడంతో బెంగళూరు పోలీసులు నిందితులు రిదైబాబు, . మహ్మద్, బాబాషేక్, హైదరాబాదు కు చెందిన హకీలను గురువారం అరెస్టు చేశారు. పంచనామా కోసం వారిని శుక్రవారం ఉదయం సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా పోలీసులపై దాడి చేసి తప్పించు కునేందుకు ప్రయత్నించారు. పోలీసులు కాల్పులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రిదైబాబు, సాగర్‌ కు గాయాలు కాగా వారిని ఆసుపత్రిలో చేర్పించారు. వీరిపై సామూహిక అత్యాచారం, ఆర్థిక నేర వ్యవహారాల నిర్వహణ, వేశ్యా వాటిక దందా నిర్వహిస్తున్న నేరాల క్రింది కేసులు నమోదు చేసారు. సదరు యువతి ఈ గ్యాంగ్ తో సంబందం లేకుండా ఇటీవల కాలంలో సొంత కార్యకలాపాలు సాగించడమే ఆమెపై ఈ అత్యాచారానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాలు కేరళలో స్నేహితులతో కలసి ఉండడంతో ఆమెను బెంగళూరుకు తీసుకొస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ వెల్లడించారు. డీసీపీ డాక్టర్ శరణప్ప కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమానుష సంఘటనపై ముఖ్యమంత్రి యడియూరప్ప వెంటనే స్పందించి తక్షణం దుర్మార్గులను అరెస్టు చేయాలని ఆదేశించారు. వీరు అక్రమంగా దేశంలోకి వచ్చి బెంగళూరులోని రామమూర్తినగర్‌లో నివసిస్తున్నారు. బాధిత యువతితో పాటు దారుణానికి పాల్పడిన వారంతా రామమూర్తి నగర్ ఎస్ఆర్ లే అవుట్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *