గుర్రాజుపేట
———————
విశాఖపట్నం జిల్లా, యస్.రాయవరం మండలం, గుడివాడ గ్రామ రెవిన్యూ గుర్రాజుపేట గ్రామంలో పాస్ బుక్స్, రిజిస్టర్ డాకుమెంట్స్ ఉoడి తన స్వాధీన హక్కు భుక్తమైన భూమిపై కన్నేసిన కాకినాడ రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగి కొర్ని వరప్రసాద్ పై పోలీసు కేసు నమోదు చేశారు.
రాత్రికి రాత్రి షెడ్ నిర్మించి, కొబ్బరి మొక్కలను నాటి, ఇదివరకే ఉన్న పంట పాడుచేసి దురాక్రమణకు పాల్పడుతున్నాడని ఈగల బంగారు పాప పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఇరు వర్గాలను విచారించి వరప్రసాద్ పై ఎస్.ఐ వి.చక్రధరరావు కేసు నమోదు చేసారు. 25.01.1994 న అప్పయమ్మ తన కుమార్తె బంగారుపాప పేరున పల్లము ఎకరా 1.00 భూమి సర్వే నెంబర్ 201-1 లో 0.25 సెంట్లు, 201-3 లో 0.25 సెంట్లు, 202-9 లో 0.25 సెంట్లు, 202-12 లో వెరసి మొత్తం ఎకరా1.00 గుడివాడ గ్రామస్తురాలైన గొoప అప్పారావు భార్య సింహాచలం వద్ద నక్కపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్ 60/1994 గా బంగారుపాప పేరున కొనుగోలు చేసినది. ఈ భూమి బంగారుపాప పేరున ఖాతా నెంబర్ 1169 గా రెవిన్యూ రికార్డులలో కూడా నమోదుచేసి, పాస్ బుక్స్, టైటిల్ డీడ్ నెంబర్ 592685 గా రెవిన్యూ అధికారులు ఇవ్వడం జరిగినది. ఇదే గ్రామానికి చెందిన బంగారు పాప తల్లి స్వయానా సోదరుడైన కొర్ని అప్పారావు కుమారుడు బంగారుపాప మేనమామ కుమారుడు అయిన కొర్ని వరప్రసాద్ కాకినాడ టౌన్ కోర్టు కాంప్లెక్స్ లో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తూ, ఈమె భూమిపై కన్ను పడి దూరాశతో అక్రమంగా పొందడానికి 25.05.2021 రాత్రికి రాత్రే వరప్రసాద్ షెడ్ ను నిర్మించి, కొబ్బరి మొక్కలను నాటి ఉన్న పంటను పాడు చేసి దౌర్జన్యంగా ఆక్రమణకు ప్రయత్నిoచడంతో ఆయనపై యస్.రాయవరం పోలీసులకు బంగారుపాప పిర్యాదు చేసినది. దీనిపై విచారణ చేపట్టిన చక్రధరరావు సెక్షన్ 447 ఇతరుల ఆస్తులలో అక్రమ ప్రవేశం, సెక్షన్ 427 ఇతరుల ఆస్తులను పాడుచయడం రెండు సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *