యస్.రాయవరం
————————-
విజ్ఞులైన అధికారులు, నాయకులు, ప్రజలూ సామాజిక భాద్యతతో ఆలోసించండి. విశాఖపట్నం పాయకరావుపేట నియోజకవర్గం మండల కేంద్రమైన యస్.రాయవరం గ్రామ వెలుగు కార్యాలయంలో ఉన్న ఆధార్ సెంటర్ వద్ద ఉన్న పరిస్థితి చూస్తే కోవిడ్ నిబంధనలు అస్సలు పాటించడం లేదని ఇట్టే అర్థమవుతుంది. కరోనా కేసులు, మరణాల భయం లేకుండా ప్రవర్తించడం కనిపిస్తున్నది. ఇక్కడ ప్రజలు, ఆధార్ సెంటర్ నిర్వాహకుడి బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. మండలంలోని సుమారు 70,000 మందికి ఈ ఒక్క సెంటర్ను మాత్రమే కేటాయించడమే ఈ పరిస్థితికి కారణం. మండలంలోని 28 పంచాయతీల్లోని సుదూర ప్రాంతాల నుండి ఆధార్ పనుల కోసం ప్రజలు ఇక్కడకు రావడంతో వీరి వలన తమ గ్రామంలో కేసులు ఎక్కడ పెరుగుతాయోనని యస్.రాయవరం గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నా ఎవ్వరికీ పట్టనట్లు వ్యవహరి స్తున్నారు. జిల్లా, మండల అధికారులు ఒకసారి ఈ విషయాలపై మీద దృష్టి సారించి మరిన్ని ఆధార్ సెంటర్లను మండలంలో పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని సెంటర్ వద్ద బాధితులను పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే మొదట్లో ఇరువురు పోలీసులు ఉండి గుంపులు లేకుండా అదుపు చేసేవారు. ఇప్పుడు ఒక పోలీసే కాపలా ఉండడం కొస మెరుపు. దీనిపై జిల్లా కలెక్టర్ కు, రూరల్ ఎస్.పి కి సోమిరెడ్డి రాజు (కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, ఎస్.రాయవరం మండలం)  ఫిర్యాదు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *