lucid absinthe gift set car gifts for boyfriend larenim mineral makeup coupons beauty brands gift card balance

ప్రత్తిపాడు
—————-
కరోనా బాధితులకు తగిన సహాయ సహకారాలను అందించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విత్తనాల వెంకట రమణ పిలుపు ఇచ్చారు. దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ పదవిని చేపట్టి ఏడేళ్లైన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ప్రత్తిపాడులో శింగిలిదేవి సత్తిరాజు ఇంటి వద్ద బిజెపి జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట రమణ రమణ మాట్లాడారు. కరోనా నివారణకు కేంద్రం నుండి ప్రధాన మంత్రి కేర్ నిదులు వేలాది వెంటిలేటర్స్ ను రాష్ట్రానికి పంపారని, అలాగే ఆక్సిజన్ కూడా పంపించారని విత్తనాల వెంకటరమణ అన్నారు. కరోనా వలన మరణించిన ప్రజలకు రూ. 4 లక్షలు, జర్నలిస్టులు రూ. 5 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారని అన్నారు. నరేంద్ర మోడీ ఏడు సంవత్సరముల పాలనలో అనేక సంస్కరణలు చేసి, కరోనా నివారణకు వాక్సిన్ అన్ని రాష్ట్రాలకు పంపించి పరిపాలన దిగ్విజయంగా కొనసాగిస్తున్నందుకు ది.30-5-2021 న కార్యకర్తలు మాస్కులు వితరణ చేయాలని, పలు సేవా కార్యక్రమాలను చేయాలని తీర్మానించారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా మంగరాజు కార్యకర్తలకు మార్గ దర్శనం చేసారు. ఈ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి శింగిలిదేవి సత్తిరాజు, ప్రత్తిపాడు మండల బిజెపి ఉపాధ్యక్షులు గున్నాబత్తుల రాజబాబు, మండల ప్రధాన కార్యదర్శి మదినే బాబ్జీ, శంఖవరం మండలం బిజెపి అద్యక్షులు పడాల నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *