శంఖవరం
——————
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రెండేళ్ళు పరిపాలనా కాలం పూర్తైన సందర్భంగా ప్రభుత్వ పాలనా విశిష్టతను తెలుపుతూ కరోనా కారణంగా ప్రజలు / కార్యకర్తలు / మీడియా సమావేశాలను నిర్వహించ కుండా ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఆయన ఓ పత్రిక ప్రకటనను తన ప్రతినిధి బొర్రా లచ్చబాబు ద్వారా విడుదల చేయించారు. ఆ విశేషాలేంటో యధాతధంగా మీరే చదవండి. …

2019 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడుగా జగన్ ఇచ్చిన హామీలను 94 శాతం ఇప్పటికే పూర్తి చేశారు. నవ రత్నాలు మేనిఫెస్టోగా ఎన్నికల బరిలో దిగిన వైయస్ జగన్మోహన్ రెడ్డి వాటిని పూర్తి చిత్తశుద్ధితో అమలు చేసి నూటికి నూరు శాతం ప్రజల మన్ననలు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులును పరుగులు పెట్టించారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీరును పెట్టి బాపూజీ కలలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేశారు.

రైతన్నకు వెన్నుదన్నుగా రైతు భరోసా, తల్లులకు పిల్లల చదువులకు భరోసా కల్పిస్తూ అమ్మఒడి, గూడు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేసే దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలన కొనసాగుతోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఒక్క సారి సంక్షేమ పథకాలు చూసినట్లయితే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, రైతులకు వడ్డీ లేని రుణాలు, పంటల బీమా, రైతు భరోసా మత్స్యకార భరోసా, జగనన్న విద్యా కానుక, వైయస్సార్ చేయూత , వైయస్సార్ వాహన మిత్ర, వైయస్సార్ కాపు నేస్తం, నేతన్న నేస్తం, వైయస్సార్ ఆసరా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, జగనన్న అమ్మ ఒడి ఇలా చెప్పిన పథకాలే కాకుండా నెల వారీ పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఆసరా వంటి పథకాలను ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనకు మద్దతు పలికారు. ఆయన నమ్మిన ప్రజలు, ప్రజలు నమ్మే దేవుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్పూర్తిగా కోరు కుంటున్నాను.

మీ పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్,
MLA ప్రత్తిపాడు….
తూర్పు గోదావరి జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *