unicef cards and gifts 2013 amazon outdoor furniture coupon code canada gifts for him christmas handmade gift ideas 2015 dsw coupon code tjoos motorco coupon code

* విలేఖర్లకు 15 రకాల నిత్యావసర సరుకులను అందజేసిన వినోద్ అగర్వాల్

కాకినాడ
—————-
కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమాజానికి సమాచారాన్ని అందిస్తున్న పాత్రికేయుల సేవలు అభినంద నీయమని ప్రముఖ వ్యాపారవేత్త వినోద్ అగర్వాల్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఆర్ అండ్ బి అతిధి గృహంలో రూ. 3 లక్షల విలువైన నిత్యావసర సరుకులను స్థానిక పాత్రికేయులకు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినోద్ అగర్వాల్ మాట్లాడారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచన మేరకు, అలాగే కాకినాడ ప్రెస్ క్లబ్ సేవా కమిటీ అభ్యర్థన మేరకు నెల రోజులకు సరిపడినన్ని నిత్యావసర సరుకులను పాత్రికేయులకు తాను అందజేసాను అన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రేయింబవళ్లు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ ప్రజలను జాగృతం చేసేందుకు వార్తా సమాచార వ్యాప్తికి నిత్యం మీడియా మిత్రులు చేస్తున్న కృషి అభినంద నీయమని ఆయన కొనియాడారు. విలేకరులకు ఎలాంటి సమయం లోనైనా అండగా నిలుస్తామని ప్రముఖ వ్యాపార వేత్త వినోద్ అగర్వాల్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సేవా కమిటీ సభ్యులు కృష్ణ, అచ్యుత రామారావు సురేష్, దుర్గారావు, వాసువర్మ. సుమన్, ఐ న్యూస్ సురేష్ , కనకాద్రి, పితాని రాము, బాల నారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *