శంఖవరం – జనాసవార్త
———————————–
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండలంల కేంద్రమైన శంఖవరంలోని సిబ్బంది వీధిలో ఏర్పాటు చేసిన మినీ వాటర్ ట్యాంక్ ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ వీధిలోని పూర్వపు గాడి నుయ్యి పరిసర ప్రాంతంలోని ప్రజలు తీవ్ర తాగు నీటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా గమనించిన ఎమ్మెల్యే ఇక్కడి తాగు నీటి సమస్య పరిష్కారానికి ఈ ప్రాంతంలో మినీ వాటర్ ట్యాంక్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రసాద్ పంచాయితీ ఉప సర్పంచ్ చింతనీడి కుమార్ ను ఆదేశించారు. దీంతో సుమారు 20,000 లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ మినీ వాటర్ ట్యాంక్ ను, దానికి సిమెంటు దిమ్మను, కుళాయిలను ఉప సర్పంచ్ తన సొమ్ములతో ఏర్పాటు చేసారు. దీనిని ఎమ్మెల్యే ప్రారంభించారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఈ మినీ వాటర్ ట్యాంక్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. సుమారు 100 కుటుంబాలకు తాగు నీరు అందుతుందని చింతనీడి కుమార్ www.janaasavaartha.com కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతనీడి కుమార్, పంచాయితీ మాజీ సర్పంచ్, అన్నవరం దేవస్థానం పాలకవర్గం మాజీ సభ్యులు, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్వత రాజబాబు, సచివాలయం 1 కార్యదర్శి సీహెచ్. శ్రీ రామచంద్రమూర్తి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *