కాకినాడ – జనాసవార్త
———————————-
తూర్పు గోదావరి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ బాధ్యతలను నూతన ఉప సంచాలకులు బి.పూర్ణచంద్రరావు సోమవారం స్వీకరించారు. విజయవాడ సమాచార పౌర సంబంధాలశాఖ కమీషనర్ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న ఈయన ఉద్యోగోన్నతిపై ఉప సంచాలకులుగా తూర్పు గోదావరి జిల్లాలో నియమితులు అయ్యారు. గతంలో ఈయన శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ డైరక్టర్ గానూ, ప్రకాశం, గుంటూరు జిల్లాల డిపిఆర్ఓగాను పని చేశారు. డిప్యూటీ డైరక్టర్ జిల్లా పదవి బాధ్యతలను ఆయన సోమవారం ఉదయం ప్రస్తుతం ఈ పదవి ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న జోన్-2 జాయింట్ డైరక్టర్ ఎల్.స్వర్ణలత నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా డిడి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని జిల్లా ప్రజలకు, ప్రజల అభిప్రాయాలను, ఆకాంక్షలను ప్రభుత్వానికి సమాచార శాఖ ద్వారా తెలపడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే మీడియా సంస్థలు, ప్రతినిధులకు ప్రభుత్వ పరమైన సంక్షేమ కార్యక్రమాల సమగ్ర సమాచారం అందేలా కృషి చేస్తాని తెలిపారు. ఆయనకు కార్యాలయ డివిజనల్ పిఆర్ఓలు పి.రవి (కాకినాడ), యండి.విలాయత్ ఆలీ (అమలాపురం), వి.వి.రామిరెడ్డి (రాజమహేంద్రవరం), ఐ.సాయిబాబు (పెద్దాపురం), ఏపిఆర్ఓ కె.రవి, ఎవిఎస్ డి.ధర్మరాజు, పబ్లిసిటీ అసిస్టెంట్ సిహెచ్.రాంబాబు, సీనియర్ అసిస్టెంట్ వి. శేఖర్, టైపిస్టులు బషీర్ అహ్మద్, జి.స్వరాజ్యకుమారి, సిబ్బంది ఎన్.చిట్టిరాజు, కె.గోపీకృష్ణ, యం.మాధవకృష్ణ, లక్ష్మీకాంతం, ఎస్.రాజేష్, యం.సతీష్, సూర్యనారాయణ, సూరిబాబు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *