* పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరణ

కాకినాడ – జనాసవార్త
————————————–
గుడా ( Godavari Urban Development Authority ) వైస్ చైర్మన్ పూర్తి అదనపు బాధ్యతలను కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం స్వీకరించారు. గుడా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డవలెప్మెంట్ శాఖ అందజేసిన ఈ బాధ్యతను చిత్తశుధ్ధితో నిర్వహిస్తానని, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా సాంకేతిక ద్వారా అత్యంత వేగంగా నాణ్యమైన సేవలను అందించామని, రానున్న 2 వారాల్లో గుడా సంస్ధలో కూడా సాంకేతికను ప్రవేశ పెట్టడం ద్వారా పార దర్శకమైన, మెరుగైన సేవలను అందించ గలుగుతాం అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *