giftcode cf vtc sears tool chest coupon zomboy merch coupons disneyland food coupons

గుర్రాజుపేట – జనాసవార్త
————————————
విశాఖపట్నం జిల్లా యస్.రాయవరం మండలం గుడివాడ శివారు గుర్రాజుపేట గ్రామంలోని ఈగల బంగారు పాపకు చెందిన భూమి దురాక్రమణకు గురైందని ఓ సారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐనప్పటికీ ఈ దురాక్రమణ ఇంతటితో ఆగలేదు. రెండో దఫా కూడా అదే దురాక్రమణ అవినీతి జరుగుతోంది.

తన ఎకరా భూమిలో కాకినాడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి కొర్ని వరప్రసాద్ రాత్రికి రాత్రి షెడ్, కొబ్బరి మొక్కలు ని ఉన్న పొలం పాడు చేసి దురాక్రమణకు పాల్పడంతో ఈగల బంగారు పాప పోలీసులకు ఇదివరకే ఓ ఫిర్యాదు చేశారు. ఫలితంగా వరప్రసాద్ పై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐనప్పటికీ అదే పొలంలో శుక్రవారం రాత్రి షెడ్ కు ప్లాస్టింగ్ చేయించి, పైపు లైన్లు వేయించాడు. దీంతో బాధితురాలు బంగారు పాప తిరిగి పోలీసులకు, స్పందనలో తహశీల్దారుకు పిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలపై సెక్షన్ 107 బైండోవర్ కేసును పోలీసులు తహశీల్దార్ కు పంపగా బైడోవర్ చేయడం జరిగింది. ఈ భూమి గత 20 ఏళ్ళుగా ఎవరి అధీనంలో ఉన్నది, ఇ.సి తదితర వివరాలను తెలపాల్సిందిగా కోరుతూ నక్కపల్లి రిజిస్ట్రార్ కు పోలీసులు లేఖ రాశారు. అలాగే ఈ భూమికి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని, రెవిన్యూ రికార్డుల వివరాలను తెలపాలని కోరుతూ తహశీల్దార్ కు కూడా లేఖ రాశారు. ఈ వివరాలు వచ్చిన తరువాత తదుపరి చర్యలు చేపడతామని ఎస్.ఐ, వి.చక్రధరరావు బంగారు పాపకు తెలిపారు.
అదే విధంగా కొర్ని వరప్రసాద్ దుశ్చర్యలు, అలాగే ఇతని స్వయానా పెదనాన్న కుమారుడు కొర్ని రాజా రమేష్ పాల్పడుతున్న చర్యలను వ్రాత పూర్వకంగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సంఘం నకు పిర్యాదు చేసినట్లు బాధితురాలు ఈగల బంగారుపాప విలేకరులకు తెలిపింది. సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇసరపు శేఖర్ యాదవ్, జనరల్ సెక్రటరీ కారుకొండ వీరేoద్ర యాదవ్, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కోడిబోయిన బాబ్జి యాదవ్, సెక్రటరీ యెడ్ల లక్ష్మణ్ యాదవ్ లకు బంగారుపాప
పిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *