* వైస్సార్ నాయకుడు అన్నందేవర బాబ్జి మరో భాగోతం.
* జలవనరులశాఖ అధికారుల ఉదాసీనత

లింగరాజుపాలెం – జనాసవార్త
——————————————
విశాఖపట్నం జిల్లా, యస్.రాయవరం మండలం, లింగరాజుపాలెం గ్రామం కొత్తచెరువులోకి నీరు వచ్చు లింగరాజుపాలెం చానల్ గ్రోయన్ ను అనుకొని ఉన్న కాలువ మదుముకు తలుపులు మూసేసాడు… తలుపుల నుండి చుక్క నీరు కూడా చెరువులోకి రాకుండా సిమెంట్ బస్తాలను మదుమునకు అడ్డంగా వేసేసాడు … తన స్వార్థం కోసం చెరువులోకి చుక్క నీరు కూడా రాకుండా అన్యాయం చేస్తున్న ఘనుడు మరెవరో కాదు… స్థానిక వైస్సార్ పార్టీ నాయకుడు, పాయకరావు పేట మార్కెట్ కమిటి సభ్యుడు అన్నందేవర వీరన్న ఉరఫ్ బాబ్జి (పాల బాబ్జి)… ఇతని అవినీతి చర్యల వల్ల సేద్యపు భూములకు సాగు నీరు అందక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ పంట నష్టంతో పాటు ఆర్ధికంగా కూడా నష్టపోతున్నారు. ఇతని చర్చల పట్ల రైతులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లింగరాజుపాలెంలో సర్వే నెంబర్ 171లో 59.92 ఎకరాల విస్తీర్ణంలో కొత్త చెరువు ఉంది. దీని నుంచి వచ్చే నీటిపై ఆధారపడి సాగయ్యే సుమారు 400 ఎకరాల ఆయకట్టు భూమి కలదు. వరహానది ఇందేశమ్మ వాకలి వద్ద మండలంలోకి ప్రవేశించి పెనుగొల్లు- ధర్మవరం వద్ద రెండుగా కుడివైపు పెనుగొల్లు వైపు పెదఉప్పలం నది(రివర్) గాను, ఎడమ వైపు ధర్మవరం వైపు వరహానది గాను చీలి తిరిగి వెంకటాపురం గ్రామం తరువాత రెండుగా కలిసి తదనంతరం శారదా నది తదితర ఎడు నదులు, ఏడు ఏరుల మొగ వద్ద కలిసి సముద్రంలో కలుస్తాయి. పెనుగొల్లు -ధర్మవరం వద్ద పెదఉప్పలం నదికి నిర్మించిన గ్రోయిన్ మూడు ఏళ్ల క్రితం ద్వంశం అయినది. దీని వలన గత రెండు సంవత్సరాలు జల వనరుల శాఖ అధికారులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేయడంతో వరహానది ఆనకట్ట ద్వారా నీరు ప్రవహించేది. ఈ ఏడాది ప్రభుత్వం జల వనరులశాఖకు రూ. 38 లక్షలు మంజూరు చేయడం, టెండర్లు పూర్తి అవ్వడం, పనులు ప్రారంభించడానికి అవసరమైన మెటల్ తెప్పించినా, ఇటీవల కురిసిన వర్షాలకు పనులు ప్రారంభించక పోవడంతో పై నుండి వచ్చిన వర్షపు నీరు ఒక్క పెదఉప్పలం నది నుండి పోతున్నది.

కొత్త చెరువుకు పెదఉప్పలం నది నుండి వచ్చు నీటితోనే లింగరాజుపాలెం ఛానల్ గ్రోయన్ చెరువు కాలువ ద్వారా నీరు వచ్చి చెరువు నిండుతుంది. అయితే లింగరాజుపాలెం వైస్సార్ నాయకుడు, పాయకరావుపేట మార్కెట్ కమిటీ సభ్యుడు చెరువులో మట్టి తోలుకోవడానికి తన స్వార్థం కోసం చెరువు కాలువ మదుము చెక్క తలుపులు మూసి, అదే కాకుండా తలుపులు నుండి వచ్చు లీకైన నీరు కూడా రాకుండా ఇసుక బస్తాలు వేసాడు. దీనివల్ల నీరు పెదఉప్పలం చెరువులోకి తరువాత సముద్రంలోకి వృధాగా వెళ్లి పోతుంది. ఒక ప్రొక్లైన్ కు 10 ట్రాక్టర్లుకు మట్టి తోలకానికీ అనుమతి పొంది నిబంధనలకు విరుద్ధంగా రెండు మిషన్లు 20 ట్రాక్టర్లుతో ప్రస్తుత కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉదయం నుండి రాత్రి వరకు ఏకధాటిగా గత నెల 13 నుండి వేలాది ట్రాక్టర్లు గ్రామం మధ్యలో నుండి ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తూ మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు, వార్తా పత్రికలు ఇతర మాద్యమాలలో వార్తలు వచ్చినా అతని అవినీతికి అంతూదరీ లేకుండా పోయింది.
బాబ్జి తీరు మారలేదు.

ఇంత జరుగుతున్నాసంబంధిత అధికారులైన రెవిన్యూ, జలవనరుల, పోలీస్ శాఖలకు సమర్పించిన ఫిర్యాదుపై చర్యలు లేక పోవడంతో బాబ్జి మరింత రెచ్చిపోయి ఇప్పుడు ఏకంగా చెరువులో నీరు నిండితే, తన మట్టి తోలకం కుదరదని నీరు రాకుండా తలుపులు వేసి, ఇంకా రెండు అడుగులు ముందు కేసి తలుపులకు అడ్డుగా ఇసుక బస్తాలు వేయడంతో చెరువులో నీరు వచ్చే అవకాశం లేకుండా పోయినది. అటు అధికారుల నిర్లక్ష్యం, ఇటు బాబ్జి ధన దాహంనకు చెరువు ఆయకట్టు రైతులు అన్యాయం ఐపోతున్నామనీ వాపోతున్నారు. ఇప్పటికైనా ‘రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక’ అని చెప్పే నాయకులు, అధికారులు బాబ్జీ అవినీతి చర్యలకు అడ్డు చెప్పకపోతే అన్నం పెట్టే రైతులకు మరింత నష్టం జరుగుతుందని సోమిరెడ్డి రాజు (కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం మండలం) సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *