* నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం

శంఖవరం – జనాసవార్త
———————————–
ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జూన్ 3 న జరుపు కుంటారు. ఐక్యరాజ్య సమితి జూన్ 3 ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా 2018 లో ప్రకటించింది. రెండు శతాబ్దాలుగా వాడుకలో ఉన్న సైకిల్ ప్రత్యేకత, సైక్లింగ్ ఇచ్చే దీర్ఘాయువు ప్రాముఖ్యతను గుర్తించి, సైకిళ్ళను అత్యంత సాధ్యమయ్యే పర్యావరణ, నమ్మదగిన, సరసమైన రవాణా సాధనంగా పరిగణించడం, సైకిల్‌ను రవాణా సాధనంగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను అంగీకరించిన ఐ.రా.స. సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇతర రకాల రవాణా వాహనాల కంటే సరళమైన, సరసమైన పర్యావరణ అనుకూలమైన సైక్లింగ్ రవాణాకే కాదు ఆరోగ్యానికి, పర్యావరణ హితానికి ఉపయోగ పడుతుంది. రోజూ సైక్లింగ్ చేయడం బరువు తగ్గడానికి, ఊబకాయాన్ని నివారించడానికి, గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి, గుండె జబ్బులు, అధిక రక్తపోటును, డయాబెటిస్, క్యాన్సర్, మరణాలు, ఒత్తిడిని, ఆందోళనను తగ్గించ డానికీ, జీవక్రియ రేటును పెంచడానికి, కండరాలను నిర్మించడానికి, ఒక గంట సైక్లింగ్ చేయడం వలన 400 నుంచి 1000 కేలరీల శరీర కొవ్వును కరిగించడం, శరీరంలో ఎండార్ఫిన్లు, ఆడ్రినలిన్, సెరోటోనిన్, డోపామైన్ రసాయనాల విడుదలకు సహకరిస్తోంది. ముఖ్యంగా టైప్1, టైప్2 డయాబెటిస్ బాధితుల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చ డానికి సైక్లింగును ప్రోత్సహించాలి. శరీరంలో ఎండార్ఫిన్లు, ఆడ్రినలిన్, సెరోటోనిన్, డోపామైన్ రసాయనాల విడుదలకు సహకరిస్తోంది. రోజూ సైకిల్ తొక్కుకుని పని ప్రదేశానికి, పాఠశాలకు, పార్కులకు వెళ్లడం ఓ వ్యాయామంగా సరిపోతుంది.

ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ప్రజల్లో శారీరక, మానసిక చైతన్యాన్ని ఏర్పర్చడానికి సైకిల్‌ను ఉపయోగించుకునే ప్రయత్నాలకు ఐక్యరాజ్య సమితి మద్దతు ఇస్తోంది. సాధారణ సైక్లింగ్ 20 నుండి 93 సంవత్సరాల వయస్సు గల వారిని గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయ పడుతుందని, ప్రత్యేకంగా రొమ్ము, పెద్దప్రేగు క్యాన్సర్. మానసిక శ్రేయస్సును మెరుగు పరుస్తుందని తన అధ్యయనంలో డానిష్ కనుగొన్నారు. ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవం, మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి, మెరుగైన, పచ్చటి ప్రపంచాన్ని సృష్టించడానికి, మీ జీవనశైలిలో సైక్లింగ్ ఒక భాగం కాగలదని ఆశిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *