* జాతీయ యాదవ సంఘం పెద్దల నిర్ధారణ

* తన భూమి, కుటుంబానికి రక్షణ కావాలన్న బాధితురాలు

గుర్రాజుపేట – జనాసవార్త
——————————————
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలం గుడివాడ శివారు గుర్రాజుపేట గ్రామంలో భూముల ఆక్రమణలు నిజమేనని జాతీయ యాదవ సంఘం పెద్దల నిర్ధారించారు. తన భూములను ఆక్రమించి, అందులో తన అనుమతి లేకుండా అభివృద్ధి పనులను అక్రమంగా చేపడుతున్నారని, పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, చివరకు మీరే న్యాయం చేయాలని బాధితురాలు బంగారుపాప చేసిన విన్నపం మేరకు ఆక్రమిత భూములను జాతీయ యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుకొండ వీరేంద్ర, విశాఖ జిల్లా అధ్యక్షుడు కోడిబోయిన బాబ్జి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల లక్ష్మణయాదవ్, కొందరు సభ్యులుతో కూడిన నిజానికి నిర్ధారణ బృందం
బుధవారం పరిశీలించింది. బాధితురాలికి జరిగిన అన్యాయంపై విచారణ చేపట్టారు. భాదితురాలి రికార్డులు, వాస్తవ పరిస్థితులు , ఆక్రమిత భూములను ఆసాంతం రిశీలించారు. ఆక్రమణలు నిజమేనని ఏకాభిప్రాయ నిర్ధారణకు వచ్చారు. అలాగే గ్రామ పెద్దలతోనూ మాట్లాడారు. వారి నుండి భూ వివాదాలపై పలు వివరాలను సేకరించారు. అనంతరం జాతీయ యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుకొండ వీరేంద్ర యాదవ్ స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇదంతా భూ అక్రమార్కుల సృష్టిగా ఉన్నదని తెలిపారు. మా యాదవుల భూముల జోలికి అక్రమంగా వస్తే మా సంఘం తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇక్కడ భూముల ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులు కూడా మా యాదవులే కావఆక్రమణకుడం బాధాకరం అన్నారు. ఏదేమైనా ఆక్రమణలకు పాల్పడిన వారు ఎవరైనా, ఎంతటి వారైనా సరే బాధితులకు న్యాయం జరిగే వరకూ మా సంఘంఙ తరపున పోరాటం చేస్తామన్నారు. గ్రామంలోని భూమి వివిధ భూముల ఆక్రమణలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *