సింహాచలం – జనాసవార్త
————————————
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలోని చారిత్రక శిల్ప కళా సంపద వైభవాన్ని భక్తులకు తెలియజేసే వినూత్న కార్యక్రమానికి దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా స్వామి ఆలయ కళ్యాణ మండపంలోని శిల్పాలు మరింత సౌకర్యంగా కనిపించేలా వాటిని శుభ్రపరిస్తున్నారు. ఇక్కడి రాతి స్థంబాలపై వున్న అపురూప, దైవ శిల్పాలు కనిపించేలా వాటిని చక్కగా తైలంతో శుభ్రం చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఈ శిల్ప సంపద సౌందర్యం భక్తులకు తేట తెల్లంగా బాగా కనిపించేలా ఈ చర్యలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఈఓ దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సింహాచల ఆలయ ఈఓగా చేసిన ఏ ఒక్కరూ చేయని ఈ పనిని ఆమె చేసి చూపిస్తున్నారు. స్వామి ఆలయంలో వున్న ఏళ్ల కాలం నాటి శిల్ప కళ భక్తులు తిలకించే విధంగా తీసుకున్న ఈఓ సూర్యకళ చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ రోజు చేపట్టిన ఈ పరిశుభ్రత కార్యక్రమంలో ఈఓతో పాటు ఏఈఓ రాఘవకుమార్, స్థానాచార్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *