శంఖవరం – జనాసవార్త
————————————-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదర్శ కళాశాలలో (ఆంధ్ర ప్రదేశ్ మోడల్ స్కూల్/ కాలేజ్)లో 2021 – 2022 విద్యా సంవత్సరం లోనికి ప్రవేశాలకు విద్యార్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూ ఉన్నామని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన శంఖవరం కళాశాల ప్రిన్సిపాల్ జీ.జ్యోతిలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, ఎమ్ఈసీ, బైపీసీ, సిఈసీ గ్రూపుల్లోకి ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే అందించే ఉచిత విద్యను పొందగోరు విద్యార్థులు అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ. 150, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులకు రూ. 100 చొప్పున దరఖాస్తు రుసుముగా చెల్లించాలని ఆమె వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 10 నుంచి 30 వరకు అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ️ఆసక్తి కలిగిన విద్యార్థులు http://www.amps.ap.gov.in /
http://www.cse.ap.gov.inవెబ్సైట్లో లాగిన్ అయ్యి నిర్ణీత ఫీజు చెల్లించి ఆదర్శ పాఠశాలలకు దరఖాస్తు చేసుకుని, ప్రింట్ కాపీని ప్రిన్సిపాల్ కి గడువులోగా సమర్పించాలని, అంతర్జాలంలో నమోదు కాని దరఖాస్తులు స్వీకరించమని ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి ఆ ప్రకటనలో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *