ప్రత్తిపాడు – జనాసవార్త
———————————-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రత్తిపాడు నియోజకవర్గం కేంద్రం ప్రత్తిపాడులో భారతీయ జనతా పార్టీ మంగళవారం ధర్నా నిర్వహించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు స్థానిక బిజెపి కార్యాలయంలో ఈ నిరసన చేపట్టారు. ఈ నిరసన కారులను ఉద్దేశించి జిల్లా పార్టీ ఇంచార్జీ దాట్లవర్మ మాట్లాడారు. రైతుల వస్తు ఉత్పత్తికి మద్దతు ధర కల్పిస్తామని, రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలును రైస్ మిల్లర్లకు ప్రభుత్వం అప్ప చెప్పినందున పూర్తి ధర రైతు పొందలేక, అనుకున్న ధర రాక, మిల్లర్ల చుట్టూ తిరగలేక, పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చలేక, బ్యాంకు అప్పుల వత్తిడి భరించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. బాంక్ పుస్తకాలు లేవని, రైతు బరోసా కేంద్రంలో పేరు నమోదు కాలేదని తిరగడమే జరుగుచున్నదని వర్మ అన్నారు. జిల్లా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి శింగిలిదేవి సత్తిరాజు మాట్లాడుతూ రైతులను వైఆర్సిపి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమములో మండల బిజెపి ఉపాధ్యక్షులు గన్నాబత్తుల రాజబాబు, మండల ప్రధాన కార్యదర్శి మదినే బాబ్జీ, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు వూటా సోమరాజు, బిజెపి జిల్లా నాయకులు కర్రి ధర్మరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతాకుల రామక్రిష్ణ, మండల నాయకులు పెట్లు కొండబాబు, ఇంటి బాబూరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *