how to create a gift certificate online paramedic retirement gifts atrovent nasal spray coupon gravity maidstone coupon code train agents coupon code belterra spa coupons

ఎ.మల్లవరం – జనాసవార్త
————————————–
నిర్ణీత కాల వ్యవధి దాటితే ఆహార పదార్థాలు కుళ్లి పోవడం ప్రకృతి సహజమైన ప్రక్రియ. ఐతే తెలిసుండి కూడా కుళ్లిన, పగిలిన కోడి గుడ్లను పంపిణీ చేయడం ఒకింత దుమారాన్ని రేపింది. ఈ విషయమై విద్యార్థుల తల్లి దండ్రుల నుంచి అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా ఈ సమాచారంతో కూడిన ఛాయా చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. విషయంలోనికి వెళితే …..తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మంండలం ఎ.మల్లవరం గ్రామం లోని మూడు అంగన్వాడీ కేంద్రాల్లోనూ కుళ్ళిన కోడి గుడ్లను మంగళవారం పంపిణీ చేసారు శంఖవరంలోని సమగ్ర మాతా శిశు అభివృద్ధి పధకం పరిధిలోకి వచ్చే ఈ మూడు అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలకు కాంట్రాక్టర్ కుళ్లిన, పగిలిన కోడి గుడ్లను లెక్క ప్రకారం గుత్తగా సరఫరా చేసాడు. సరఫరా దశలోనే గుడ్ల నాణ్యతా స్థితిని గమనించి వాటిని తిరస్కరించాల్సిన కార్యకర్తలు, ఆయాలు గమనించకుండా పిల్లలు తల్లి దండ్రులకు టేక్ హోమ్ రేషన్ కింద పంపిణీ చేసేసి చేతులు దులిపేసు కున్నారు. దీంతో తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అసలే కరోనా రోజులు… అందునా పలు జాగ్రత్తలు చెప్పే అధికారులే ఇలా కుళ్లిన గుడ్లను పంపిణీ చేయడం ఏంటని సామాజిక మాధ్యమాల కెక్కడంతో పాటు సిడీపీఓ. ఊర్మిళ దృష్టికి విషయాన్ని తీసుకు వెళ్ళారు. ఇదే విషయమై సిడీపీఓ. ఊర్మిళను “పబ్లిక్ వైబ్” వీలేకరి రాత్రి 9.19 గంటలకు వివరణ కోరగా పెద్ద మొత్తంలో గుడ్లను పంపిణీ చేస్తున్నందున ఒక్కో సారి కాంట్రాక్టర్ తప్పిదం వల్ల ఇలాంటి పొరపాటు జరుగుతోందని, కుళ్లిన గుడ్లకు బదులుగా మంచి గుడ్లను బుధవారం పంపిణీ చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *