ఆంధ్రప్రదేశ్ వార్డు, సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఉపాధ్యక్షుడుగా సరమర్ల సత్యవెంకటేష్ ఎన్నిక

శంఖవరం – జనాసవార్త
———————————-
ఆంధ్రప్రదేశ్ వార్డు, సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ (రిజిస్టర్డ్ 13/2020) తూర్పు గోదావరి జిల్లా శాఖ ఉపాధ్యక్షుడుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన శంఖవరం సచివాలయం -3 కార్యదర్శి సరమర్ల సత్యవెంకటేష్ ఎన్నిక అయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. జిల్లా శాఖ అధ్యక్షుడుగా కాకినాడకు చెందిన దారపురెడ్డి తాతాజీరావు ఎన్నిక కాగా శంఖవరం మండలం నుంచి అన్నవరం గ్రామ వాసి, శంఖవరం సచివాలయం – 3 కార్యదర్శి సత్యవెంకటేష్ ఉపాధ్యక్షుడుగా ఎన్నిక అయ్యారు. ఆంధ్రప్రదేశ్ వార్డు, సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ను బలోపేతం చేయడాని ఏర్పాటైన తమ సంస్థ సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తుందని, ఈ యూనియన్ ప్రొబెషన్ డెక్లరేషన్ కోసం కృషి చేయగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమ్మతి తెలిపారని, సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని, ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి మెరుగైన సమాజం కోసం కృషి చేయాలని అసోసియేషన్ ఆశిస్తోందని ఆ ప్రకటనలో అసోసియేషన్ వెల్లడించింది. ఈ సందర్భంగా జిల్లాలోని సచివాలయాలు, శంఖవరం మండలంలోని 16 సచివాలయాల ఉద్యోగులు అందరూ ఉపాధ్యక్షుడు సరమర్ల సత్యవెంకటేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *