sears portrait studio sitting fee coupon make diy christmas gifts best gift for husband turning 30 eat street coupon codes november 2015

వాకపాడు – జనాసవార్త
——————————————-
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం మండలం వాకపాడు గ్రామ రెవిన్యూ పరిధిలోని రామసాగరం చెరువుకు ఉన్న నాలుగు మదుముల(స్లయిజ్లు)ను, ఏకైక చప్టా (సర్ప్లస్ స్పియర్)లకు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇవి ఎంతో కాలంగా
శిథిలావస్థకు చేరినా ఎటువంటి పునరుద్ధరణ చర్యలు చేపట్టడం లేదని ఆయకట్టు రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 42 లో 144.47 ఎకరాల గర్భం విస్తీర్ణంతో నాలగు మదుములు, ఒక చప్టాతో వీరామసాగరం చెరువు విస్తరించి ఉన్నది. ఈ నాలుగు తూములలో ఒక మదుము పూర్తి గాను, మిగిలిన మూడు మదుములు పాక్షికంగాను, చప్టా పూర్తి గాను శిథిలావస్థకు చేరుకొన్నాయి. వీటిని పునరుద్ధరించాలని ఆయకట్టు రైతులు జల వనరుల శాఖ అధికారులకు పలు మార్లు ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి వీటిని పునరుద్ధరణ చేసి రైతులను ఆదుకోవసిన అవసరం ఎంతైనా ఉన్నదని రైతు వర్గాలు అంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *