శంఖవరం – జనాసవార్త
———————————
శంఖవరం మండలంలోని అన్ని గ్రామాల్లోని స్వంత సాగు రైతులు, కౌలు రైతుల ప్రయోజనార్ధం సార్వా సాగుకు సమాయత్తం, సాగు రైతు హక్కు పత్రాలు పొందడం అనే ప్రధానాంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ఆయా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద ఈ నెల 21 తారీఖు వరకూ రైతులకు అవగాహన సదస్సులను నిర్వహిస్తామని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండల వ్యవశాయశాఖాధికారి కెజె.చంద్రశేఖర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల11 నుంచి 21 వ తేదీ వరకు 12,13,20 తేదీల రోజులను మినహాయించి వరుసగా 8 రోజుల పాటు ప్రతీ గ్రామంలో ఉదయం 8 -12 గంటల మధ్య మండలం వ్యవసాయ శాఖాధికారి, మండల తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం సంయుక్త సారధ్యంలో నిర్వహించే ఈ సదస్సుల్లో ప్రతీ రైతూ పాల్గొనాలని చంద్రశేఖర్ కోరారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ పంటల బీమా, పంట ఋణాలు, రాయితీలు మొదలగు అన్ని పధకాల ప్రయోజనాలనూ రైతులు పొందాలంటే ప్రభుత్వంలో ఈ పంట విధానంలో పంటల వివరాలను తప్పకుండా నమోదు చేయించు కోవాలని ఆయన తెలిపారు. రైతుల పంటలపై వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఉమ్మడి అజమాయిషీ నిర్వహణా విధానంపై తాహశీల్దార్, వ్యవశాయశాఖాధికారి ఆధ్వర్యంలో విఆర్ఒలకు, గ్రామ సర్వేయర్లకు‌, విఎఎలకు, విహెచ్ఎలు, వియస్ఎలకు గురువారం శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ సితారామ్, శ్రీనివాస్, గ్రామ వ్యవసాయ, ఉద్యానవన, సర్వేయర్లు, పట్టుపరిశ్రమ సహయకులు తదితరులు పాల్గొన్నారని వ్యవశాయశాఖాధికారి కెజె.చంద్రశేఖర్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *