ప్రత్తిపాడు – జనాసవార్త
———————————–
ప్రజా హక్కుల పరి రక్షణకు పోరాటం చేయడానికి జాతీయ మానవ హక్కుల మిషన్ పునరంకితం అయ్యిందని మిషన్ రాష్ట్ర ప్రతినిధి, రాష్ట్ర లీగల్ సెక్రటరీ, న్యాయవాది పిల్లి బలరాముడు పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల మిషన్ 10 వ వార్షికోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామంలోని శారద వయోవృద్ధుల ఆశ్రమాన్ని మిషన్ రాష్ట్ర సభ్యులు ఇండుగపల్లి నూకరాజు, పెద్దింటి లక్ష్మణరావు, అబ్బిరెడ్డి నారాయణరెడ్డి, పలివెల నాగేంద్రరాజు, ఎస్కే సత్తార్, షేక్ శుభాన్, షేక్ సలీం, గంపల రాజు, మాకినీడి నాగసత్యనారాయణ ఆదివారం సందర్శించారు. అక్కడ నిరాశ్రయ వృద్దులకు భోజనం అందించారు. ఈ వయో వృద్ధుల కుటుంబ వివరాలను విచారించారు.

ఈ వయో వృద్ధుల సంక్షేమం, పోషణ, ఇతర అవసరాలను తీర్చేందుకు భాద్యులైన వారసులకు వయో వృద్ధుల రక్షణ చట్టం 2007 ప్రకారం నోటీసులను జారీ చేసి, వీరికి చట్టపరమై ఫలాలు అందించాలని నిర్ణయించారు. అదే విధంగా వీరి సమక్షంలో మానవ హక్కుల మిషన్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ హక్కులు ఉల్లంఘన జరిగే ప్రతీ చోట హక్కుల సాధన కోసం న్యాయస్థానంలో బాధితులు తరఫున కేసులు దాఖలు చేయాలని నిర్ణయించారు.

అనంతరం వృద్ధులు, సభ్యులనూ ఉద్దేశించి బలరాముడు మాట్లాడారు. భారత రాజ్యాంగం హామీ యివ్వబడిన మానవులు యొక్కప్రాణం, స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలకు, వీరి యొక్క ప్రాధమిక హక్కులు, ఆర్ధిక, సామాజిక న్యాయ హక్కులు అన్ని వర్గాల ప్రజలు పోరాట చైతన్యం పరిజ్ఞానం కల్పించి, హక్కుల రక్షణ నిమిత్తం మానవ హక్కుల కమీషన్, జాతీయ మైనారిటీ కమీషన్, ఎస్సీ,ఎ స్టీ మహిళా కమీషన్లకు సంబంధించిన ఫోటోలతో సహా ప్రతీ 6 నెలలకూ ఒక సారి సమస్త విషయాల్లో మిషన్ నివేదన దాఖలు చేస్తామన్నారు.

అదే విధంగా ఎస్సీ వారి యొక్క ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలులో ని విషయములు, రెవిన్యూ పరమైన 22 రెవిన్యూ చట్టాల ప్రకారం అధికారులు వలన జరిగే నిర్లక్ష్యం, జాప్యాలు, అధికార దుర్వినియోగం వలన హక్కులకు భంగం కలిగే వాటిని నివారించి అన్ని వర్గాల ప్రజలు పోరాట యోధులుగా మారే విధంగా ప్రశ్నించే దైర్యం, తెగువ కొరకు చైతన్య పర్చుట. పోలీసు డిపార్టుమెంటులో ప్రజలకు మౌలిక పాలన హక్కులు అమలు జరిగే విధంగా, వైపల్యాలు, మిషన్ అనుమతులు మేర రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు ప్రతీ 3 నెలలు ఒక సారి నివేదనలు దాఖలు చేయాలని నిర్ణయించా మన్నారు.

అదే విధంగా రాష్ట్ర, నియోజిక వర్గాల స్థాయిలో నాన్ షెడ్యూలు గిరిజన గ్రామాలు, షెడ్యూల్డు ప్రాంతాలలో విలీనానికి కృషి చేయడం.వీరికి గల రాజ్యాంగ అధికరణం 244 గా 5 వ షెడ్యూల్డులో గుర్తింపునకు 1960 లో గల దెబార్ కమీషన్ సిఫార్సులు, అధిక జనాభా వుండి అభివృద్ధికి నోచుకోని, పూర్తి గిరిజన గ్రామాలు సరిహద్దులో ఉన్న, 50 శాతం జనాభా పైబడిన గ్రామాలు షెడ్యూల్డు గ్రామాలుగా పరిగణించమని, 1975 నుండి కేంద్రం ఆమోదం వున్నా రాష్ట్రాలలో అమలు గాని తీరు, ఉప ప్రణాళిక ప్రాంతాలుగా గుడా ఆమోదం రాని, ఆంధ్రలో వున్న 115 గిరిజన గ్రామాలలో 679 నాన్ షెడ్యూలు గ్రామాల జాబితా కలపకుండా, తాలూకాలు స్తానే మండలాలు వచ్చిన, 2014 విభజన కాలంలో గాని,2001 అనుబంధ గ్రామాలలో 2013 ప్రతిపాదన నిర్లక్ష్యము, 2019లో జరిగిన గిరిజన సహాయ మండలి తీర్మానం గురించి, గిరిజనులు ఉపాధిహామీ పథకంలో అమలు తీరు, గిరిజన ప్రాంతంలో టూరిజం ప్రాజెక్టులో భాగంగా భాగస్వామ్యం, జవాబుదారీ, గిరిజన ప్రాంతంలో మహిళలు, బాలిక పట్ల వివక్ష, గిరిజన హక్కుల ఉల్లంఘనలు, గిరిజన సమస్యలని పరిష్కరించడంలో అధికారుల కృషీ లోపంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

గిరిజన ప్రాంత పేసా నియమాలు 1996, 1998, 2011 వచ్చినా నిస్పారంతో ఉల్లంఘన, గనులు ఖనిజాలు క్రమబద్దీకరణ అభివృద్ది చట్టం 1957, భూ బదలాయింపు 1959, వ్యవసాయ ఉత్తతులు, 1966 అటవీ చట్టం, 1967 అటవీ ఉత్తత్పులు వర్తకం, అటవీ సంరక్షణ, విద్యా చట్టం, సాగు నీటి చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 హక్కుల అమలులో ఉల్లంఘనలు జరుగుతూ వున్నాయి. వీటి అన్నింటా ప్రజలను చైతన్యం చేసి వారి హక్కుల పరిరక్షమ కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మిషన్ రాష్ట్ర ప్రతినిధులు ప్రతిజ్ఞ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *