* ఉద్యోగుల ప్రయాస – ప్రజల అనాసక్తి

శంఖవరం – జనాసవార్త
———————————–
శంఖవరం మండలంలోని శంఖవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల్లో ఏర్పాటు చేసిన శాశ్వత కరోనా టీకాల కేంద్రాల్లో సోమవారం140 మందికి టీకాలను వేసారు. ఇందుకోసం 14 టీకాల వయల్సును వినియోగించారు. ఈ రోజు ఈ రెండు టీకా కేంద్రాల్లోనూ ఒక్కో కేంద్రానికి 150 చొప్పున మొత్తం 300 మందికి టీకాలను వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా అందులో మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి పధకం కూలీలు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, అలాగే రాబోయే తర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని ఐదేళ్ళలోపు పిల్లలున్న తల్లులకు, 45 సంవత్సరాల వయసు వారికీ అతి కష్టం మీద మొత్తం 140 మంది వరకూ టీకాలను వేయగలిగారు. ఈ రోజు ప్రజలు టీకాలకు అంతగా ఆసక్తి చూపక పోవడంతో కార్యక్రమం ఆసాంతం మందకొడిగా సాగింది. సాయంత్రం పొద్దు పోయే వరకూ వైద్య ఆరోగ్య శాఖతో పాటు మండలం లోని వివిధ శాఖల సిబ్బందికి నిరీక్షణ, కాల హరణం తప్పలేదు. మొత్తం మీద ఈ రోజు ఉద్యోగుల ప్రయాసే తప్ప ప్రజల్లో అంతగా అసక్తి కనపడలేదు. ఈ టీకా కేంద్రాల్లో శంఖవరం ప్రభుత్వ ఆస్పత్రి ప్రధాన వైద్యులు ఆర్వీవీ సత్యనారాయణ, హెచ్వీ వీరలక్ష్మి, శంఖవరం ఏఎన్ఎమ్ గ్లోరీ, శంఖవరం ఆశ కార్యకర్తలు జక్కల సూర్యకాంతం, జక్కల సునీత వైద్య సహాయక సేవలను అందించారు.

ఆసాంతం మందకొడిగా సాగింది. సాయంత్రం పొద్దు పోయే వరకూ వైద్య ఆరోగ్య శాఖతో పాటు మండలంలోని వివిధ శాఖల సిబ్బందికి నిరీక్షణ, కాల హరణం తప్పలేదు. మొత్తం మీద ఈ రోజు ఉద్యోగుల ప్రయాసే తప్ప ప్రజల్లో అంతగా అసక్తి కనపడలేదు. ఈ టీకా కేంద్రాల్లో శంఖవరం ప్రభుత్వ ఆస్పత్రి ప్రధాన వైద్యులు ఆర్వీవీ సత్యనారాయణ, హెచ్వీ వీరలక్ష్మి, శంఖవరం ఏఎన్ఎమ్ గ్లోరీ, శంఖవరం ఆశ కార్యకర్తలు జక్కల సూర్యకాంతం, జక్కల సునీత వైద్య సహాయక సేవలను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *