*ఎమ్మెల్సీగా రాష్ట్రపతి ఆమోద ముద్ర
* ఇక చట్ట సభలోకి తోట అడుగులు
* అటు పోట్లను ఎదుర్కొన్న

  అమరావతి  – జనాసవార్త


ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ఆమోదం తెలిపారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, రమేష్‌ యాదవ్‌, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్‌రాజు పదవులు చేపట్టారు. వీరిలో  ఎమ్మెల్సీ “తోట త్రిమూర్తులు రాజకీయ జైత్రయాత్ర “ప్రత్యేక కథనం ఇది .

సంచనాలకు కేంద్ర బిందువైన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తన రాజకీయ జైత్రయాత్రలో మరో మైలురాయిని చేరుకున్నారు. తాజాగా గవర్నర్ కోటాలో ఆయన శాసన మండలి సభ్యునిగా నియమితులు అయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ బిశ్వభూషణ్ సోమవారం ఆమోద ముద్ర వేశారు. గత రెండు రోజులుగా నియామకాలపై నెలకొన్న ఉత్కంఠతకు నేటితో తెర పడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉండటంతో ఆయనకు ఈ పదవి వరించింది. దీంతో అటు రామచంద్రపురం, ఇటు మండపేట నియోజకవర్గాల్లోమ ఆయన అభిమానుల్లో ఆనందోత్సాహం నెలకొంది. ఆయనకు అభినందనలు వెల్లువెత్తు తున్నాయి.

1994లో తోట త్రిమూర్తులు రాజకీయ అరగ్రేటం చేసి తన తొలి ఎన్నికల్లోనే సంచలన విజయం నమోదు చేశారు. శాసన సభకు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అప్పటి అధికార టిడిపిలో చేరారు. 1996లో ఆయనపై శిరోముండన కేసు నమోదైంది. అప్పట్లో అదో సంచలనం. ఇక సుదీర్ఘ కాలంగా కేసు సాగుతూనే ఉంది. ప్రతికూల పరిస్థితిలోను సహనం కోల్పోకుండా సంయమనంగా వ్యవహరించడం ఆయన విజయాలకు మెట్లు. 2004 లో ఓటమి చవి చూసిన ఆయన 2008 లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. జిల్లాలో ప్రజారాజ్యం పార్టీకి పెద్ద దిక్కుగా మారారు.

2009 లో పిఆర్పీ నుండి పోటీ చేసి ఓడి పోయారు. అనంతరం చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయగా తోట కూడా కాంగ్రెస్ లో చేరారు. 2012 లో రామచంద్రపురం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఆ ఎన్నికల్లోనూ విజయం చేజిక్కించు కున్నారు. 2019 లో టిడిపి, జనసేన, వైకాపా ఆయన కోసం ఎదురు చూసేలా చేశారు. సస్పెన్స్ మధ్య టీడీపీ నుండే పోటీ చేసి ఓడిపోయారు. ఇక త్రిమూర్తులు పని అయిపోయిందని రాజకీయ వైరి వర్గం ప్రచారం చేయడం ఆరంభించిన తరుణంలో ఆయన వైస్సార్ సిపి తీర్థం పుచ్చుకున్నారు. అప్పటికే పలు సమస్యలతో సతమత మవుతున్న మండపేట వైస్సార్ సిపిని గాడిలో పెట్టేందుకు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు మండపేట ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు.

ఇక తోట రాజకీయ ఆట ఆరంభించారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆయన వేగంగా పావులు కదిపారు. మండపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దారు. పార్టీపై పూర్తి పట్టు సాధించారు. ఈ దశలో స్థానిక ఎన్నికలు ముందుకు వచ్చాయి. పంచాయితీ ఎన్నికల్లో 42 గ్రామాల్లో మెజార్టీ గ్రామ సర్పంచ్ పదవులు దక్కించుకుని తన సత్తా చూపించారు. ఇక ధన, కుల రాజకీయాలకు రోల్ మోడల్ అయిన మునిసిపల్ ఎన్నికలు ఆయనకు కత్తి మీద సాముగా మారాయి. ఈ దశలో ప్రత్యర్ధులు తోట ఇక్కడ ఉంటే శాశ్వతంగా మండపేటను వేరే ప్రాంతం వారు రాజ్యమేలు తారని స్థానికేతర నినాదం తెరపైకి తెచ్చారు. వాటిని బలంగా తిప్పి కొట్టి తనదైన వ్యూహంతో మండపేట మునిసిపల్ ఎన్నికల్లో తోట హవా కనపర్చారు. చావో రేవో చందనా పుర ఎన్నికల్లో తల బడ్డారు. తోట వ్యూహం పలించింది. ఎన్నికల్లో విజయం వరించింది.

ఈ నేపథ్యంలో గవర్నర్ కొటాలో అయనను ఎమ్మెల్సీ గా జగన్ ప్రకటించారు. ప్రభుత్వ ప్రతిపాదనలు గవర్నర్ కు పంపారు. రెండు రోజులు పాటు ఆమోదముద్రకు జాప్యం ఐయింది. దీంతో రాజకీయ ప్రత్యర్ధులు మరో సారి దుష్ప్రచారానికి తెర లేపారు. నేర చరిత్ర అంశం చర్చకు తెచ్చారు. కులాల కుంపట్లు పెట్టేందుకు విశ్వ యత్నం చేశారు. ఎన్ని అవాంతరాలు వచ్చిన తొణకక నిండు కుండలా మిన్నకుండి పోయారు. ఈలోగా ఊహాగానాలు, కల్పిత కథలకు తెరవేస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. బుధ, గురువారాల్లో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తోటను ఎమ్మెల్సీ పదవి వరించడం జిల్లాతో బాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *