శంఖవరం – జనాసవార్త
————————————
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.రాంబాబును వి.ఆర్.లో పెట్టారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆష్మీ ఉత్తర్వును జారీ చేసారు. తక్షణమే రిలీవ్ చేసి ఏలూరు డి.ఐ.జి ఆఫీసుకు రిపోర్ట్ చేసేలా పంపాలని పెద్దాపురం డి.ఎస్.పి. అరిటాకుల శ్రీనివాసరావును ఆదేశిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రత్తిపాడు పోలీసు సర్కిల్ పరిధిలో
అక్రమంగా కారులో గంజాయిని రవాణా చేసిన నేరంలో పట్టుబడిన కారును ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేసిన 126 / 2019 కేసులో మారుతి స్విఫ్ట్ కారు ఇంజన్ను పోలీసులు మాయం చేసి అమ్మారని చినశంకర్లపూడి గ్రామానికి చెందిన బాధితుడు ఏపూరి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆష్మీ ఆదేశాల మేరకు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ను కేసు దర్యాప్తు ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం విదితమే. ఇందులో భాగంగా 9 రోజుల పాటు అడిషనల్ ఎస్పీ విచారణ చేసారు. నేపథ్యంలో సి.ఐ.ని వి.ఆర్.కు పంపారనే విషయం పెద్ద చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *