* జవాబుదారీ కాని కుటుంబ సభ్యులు.
* భాదితులకు న్యాయం జరిగేనా ?

యస్.రాయవరం – జనాసవార్త
——————————————-
ప్రభుత్వ లైసెన్సులు లేకుండా చీట్టి పాటలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో వందలాది మంది చిట్టీల భాదితులు గగ్గోలు పెడుతున్నారు. నిర్వాహకుని నుంచి బాధితులకు రావలసిన సొమ్ములకు అతని కుటుంబ సభ్యులు జవాబుదారీ కావడంలేదు. విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజక వర్గంలోని మండల కేంద్రమైన యస్.రాయవరం గ్రామంలో కర్రి నాగేశ్వరావు (నాగు), అతని డిగ్రీతో పాటు బి.ఇడి చేసిన భార్య వీరనాగమణితో కలిసి చీటి పాటలు నడిపేవాడు. 1 నుచి 5 లక్షల వరకూ వివిధ సంధర్భాల్లో 12 వరకూ చీటీ పాటలను నిర్వహించేవాడు. స్థానిక చెరుకు కాటా వద్ద అధునాతన గృహాన్ని కూడా వీరు నిర్మించు కున్నారు. అయితే 18.05.2021న నాగు కరోనాతో మృతి చెందాడు. దీనితో వడ్డీకి అప్పులు తెచ్చి చీటీలు కట్టిన అందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మృతుని భార్య వీరనాగమణి చెప్పిన సమాధానంతో బాదితులు కంగుతిన్నారు. తమ సొమ్ము సక్రమంగా వస్తుందన్న భరోసా కనిపించలేదు. దీంతో ఆదివారం 20.06.2021 స్థానికుడైన యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజును ఆశ్రయిoచి తమ గోడు విన్నవించు కున్నారు. వందలాది మంది భాదితులకు అధికారులు న్యాయం చేయాలని రాజు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *