* సమగ్ర శిక్షలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను తక్షణమే పెంచాలి
* శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల గౌరవ అధ్యక్షులు డాక్టర్ గుండబాల మోహన్

పెద్దపాడు – జనాసవార్త
———————————
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష పధకంలో పని చేస్తున్న ఒప్పంద, పొరుగు సేవలు ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులకు కేజీబీవీ పాఠశాలలో పని చేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉపాధ్యాయులకు, కే.జీ.బీ.వీలలో ఇంటర్మీడిట్ కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ఆ సంఘ గౌరవ అధ్యక్షుడు గుండబాల మోహన్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గ్రామపంచాయతీలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో బుధవారం ఉదయం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసారు. ఆయన మాటల్లోనే….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష  విభాగంలో ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పద్ధతిలో ఆర్ట్ , క్రాఫ్ట్ ,వ్యాయామ విద్య బోధకులను పని చేస్తున్నారు, అయితే వీరికి నాలుగు సంవత్సరాల నుంచి 14, 203/- రూపాయలు గౌరవ వేతనము తో పని చేస్తున్నారు,  నిజానికి వీరికి గౌరవ వేతనం ప్రస్తుత కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి  25, 000/-  ఇవ్వాలని కోరుతున్నారు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు తమ పిల్లలను ఇప్పటికే జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీలకు పంపించినా నుంచి ఎటువంటి ఆర్థిక సహాయ సహకారాలు ఇటు విద్యార్థులకు ఇటు  బోధకులను ప్రభుత్వము ఆదుకో లేక పోతుందనే వాపోతున్నారు, అలాగే ప్రతి ఏడాది బడి మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమంలో ముఖ్య భాగం ముఖ్య పాత్ర పార్ట్ టైం బాధ గలదేని జగమెరిగిన సత్యం, అలాగే  కే.జీ.బీ.వీ .ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా అధ్యాపకులకు కేవలం నెలకు 12,000/-  గౌరవ వేతనం ఇస్తున్నారు.  కొన్ని జిల్లాల్లో గతంలో పనిచేసిన కొంతమంది గెస్ట్ అధ్యాపకులను కూడా కేవలం ఐదు నెలలకి ఉద్యోగము వేసుకుని నెలకు   10, 000/-  రూపాయలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారు, ప్రతి ఏడాది ఈ గెస్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత అస్సలు లేదు,   ఇది మరీ అన్యాయం అని కే. జీ. బీ. వీ . అధ్యాపకులు పేర్కొంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం లో పనిచేస్తున్న కే. జీ. బీ. వీ. అధ్యాపకులకు  వారానికి కొన్ని రోజుల్లో  24  గంటలు కళాశాలలో పని చేస్తున్నారు,అదేవిధంగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు 37, 000 నెలకు జీతం ఇస్తున్నారు, అయితే ఒక పని ఒకే విధంగా రెండు విభాగాల్లో పని చేస్తున్నా నెలకు వస్తున్న జీతము పూర్తి వ్యత్యాసం  కనబడుతుంది, విద్య అర్హతలు వచ్చేసరికి  ప్రభుత్వ  కళాశాలలో పని చేస్తున్నా  అధ్యాపకులకు కంటే కే. జీ. బీ. వీ. కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు అదనపు విద్య అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు,  అన్నిటికన్నా ముఖ్యంగా కే. జీ. బీ. వీ. కళాశాలలో బోధించే అధ్యాపకుల ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యార్హతలు పూర్తి చేసి ఉండాలని నిబంధన కూడా పెట్టారు, మరి ఈ కే. జీ. బీ. వీ. అధ్యాపకులకు వీరికి పేరుకు పార్ట్ టైం, పనిచేస్తుంది ఫుల్ టైం,జీతాలు మాత్రం పార్ట్ టైం చెల్లిస్తున్నారు, వీరి సేవలు మాత్రం గతంలో కళాశాలను మానివేసిన బాలికల  విద్యార్థుల యొక్క సమాచారం సేకరించి తిరిగి వారిని తిరిగి కళాశాలలో చేర్పించారు, గత ఇంటర్మీడిట్ కళాశాలలో కూడా కేజీబీవీలో  90%, పైగా ఫలితాలను  సాధించారు ,  ముఖ్యంగా తాత్కాలిక  కే. జీ. బీ. వీ అధ్యాపకులు  రోజు పాఠశాలకు, కళాశాలలకు  ఉదయము, మధ్యాహ్నము, రాత్రి కూడా పనిచేస్తున్నప్పటికీ, ఉద్యోగం వచ్చేసరికి పార్ట్టైమ్ అని రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు చెప్పి వీరి చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు, వీరికి రీ ఎంగేజ్ ఉత్తర్వులు పార్ట్ టైం పేర్కొని జీతం ఎందుకో చాలా చాలా నట్లు ఇస్తున్నారు, మరో విషయం ఏమిటంటే ప్రతీ ఏడాది  జీతాల   నూతన వేతనాలు ప్రకారం జీతం ఎంతో కొంత శాతం పెంచుతామని రాష్ట్ర సమగ్ర శిక్ష  అధికారులు చెబుతున్నప్పటికీ 5 సంవత్సరాల నుంచి  నేటికీ ఒక రూపాయి పెరగక పోవడం విశేషం, ఇప్పటికైనా పార్ట్ టైం అనే పదమును తొలగించి ఫుల్ టైం క్రింద మార్చి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని , సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఆర్ట్ , క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు, కే.జీ.బీ.వీ ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు , రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను, రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ వి. సెలవిని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *