* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజాహిత వ్యాజ్యం నమోదు

అన్నవరం – జనాసవార్త
———————————
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రబుత్వం నియమించిన మానవ హక్కుల సంఘం సభ్య బృందం పని చేసేందుకు అనువైన వసతి, సౌకర్యాలను కల్పించాలని న్యాయవాది ఆకాశపు మల్లేశ్వరరావు కోరారు. ఈమేరకు తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం న్యాయవాది, ఆంధ్ర ప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ (APCLA) జాయింట్ సెక్రటరీ, ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ న్యాయవాది ఆకాశపు మల్లేశ్వరరావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసారు. నియామకం నాటి నుంచి నేటి వరకూ సంఘానికి ఎటువంటి వసతులనూ ప్రభుత్వం కల్పించని విషయాన్ని ఆయన ఈ సంధర్భంగా గుర్తు చేసారు. వసతి, సౌకర్యాల లేమి వలన రాష్ట్ర ప్రజలు ఫిర్యాదులు చేయడం కష్టమౌతుందని, అందువలన వెంటనే ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘానికి వెంటనే కార్యాలయం తదితర వసతి సదుపాయాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని మల్లేశ్వరరావు వేసిన ప్రజాహిత వ్యాజ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అరుప్ కుమార్ అధ్వర్యంలో బెంచ్ విచారించింది. ఫిర్యాదు దారుడు కోరినట్లు వెంటనే మనవ హక్కుల సంఘానికి కార్యాలయం, తదితర వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో తెలియచేస్తూ లిఖిత వాంగ్మూలాన్ని జూలై 5 వ తేదీన సమర్పించాలని ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *