* మండపేటలో అమలు కాని కరోనా నిబంధనలు

మండపేట – జనాసవార్త
———————————-
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజక వర్గం మండపేటలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు
తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా యథావిధిగా పని చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఇప్పుడిప్పుడే పుంజు కుంటోంది. కరోనా నుంచి పూర్తి స్థాయి రక్షణకు మరి కొంత సమయం పట్టడం ఖాయం. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా పూర్తిగా తగ్గిందని భావించకూడదు. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తప్పనిసరిగా మాస్కు ధరించడం, బయటకు వెళ్లినపుడు భౌతిక దూరం పాటించడం, తరచూ సబ్బుతోగానీ శానిటైజర్ తో గానీ చేతులను శుభ్రం చేసుకోవడం మరవకూడదు. ఇందుకోసం పాటించాల్సిన ముఖ్యమైన విధానం ఎస్.ఎం.ఎస్ ( సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్). కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి ప్రస్తుతానికి  ఉన్న ఆయుధాల్లో ఈ ఎస్.ఎం.ఎస్ విధానం అతి ముఖ్యమైనది.

మండపేటలో ఆందోళన
———————————-
రెండు రోజులుగా మండపేటలో కారోనా ఆందోళన కలిగిస్తోంది. అనుమానితులు సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. ఒక్క మంగళవారం మండపేట టౌన్ లో కరోనాతో అధికార లెక్కల్లో ఐదుగురు మృతి చెందారు. మండపేట మండలం తాపేశ్వరం శివారు పేకెటి పాకల్లో అరగంట వ్యవధిలో భార్య భర్తలు ఇరువురు కరోనా రక్కసికి బలయ్యారు. వీరి అంత్యక్రియలు మండపేట గాంధీనగర్ కు చెందిన జమాత్ ఇస్లాం హింద్ సభ్యులు నిర్వహించారు. మరో వైపు కోవిడ్ లక్షణాలు ఉన్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. టెస్ట్ లు ఎక్కడ నిర్వహిస్తున్నారో అనే సమాచారం కూడా లేదు. దీంతో ప్రజలు ప్రేవేటు ఆసుపత్రులు, పిఎంపీలను ఆశ్రయిస్తు ఉన్నారు. ప్రేవేటులో కిట్లు రూ. 1 500 నుండి రూ 2,000 చొప్పున దండుకుంటున్నారు. నిరుపేదలు అప్పులు చేసి టెస్ట్లు చేయించు కుంటున్నారు. పట్టణంలో మొత్తం కరోనా నిబంధనలకు ప్రజలు గేట్లు ఎత్తేశారు. ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదు. ఎవరినైనా కదిపితే రాజకీయ ర్యాలీలకు లేని కరోనా నిబంధనలు తమకెందుకు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. అది నిజమే అంటూ అధికారులు, పోలీసులు ఎవరెలా చస్తే తమకెందుకు అనే చందంగా వ్యవరిస్తున్నారు.

పాటించకపోతే యమపురికే…
———————————————
గతం లో ఉగాది పురస్కారాలు పేరిట ఏప్రిల్ 13 న నిర్వహించిన రాజకీయ సభలో తండోప తాండలుగా పాల్గొన్న వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటు ఉన్నారు. చాలా మంది కోవిడ్ కాటుకు బలయ్యారు. ఇప్పుడు మరో సారి ప్రమాదం పొంచి ఉంది. నిబంధనలు పాటించక పోతే నేరుగా యమపురికి ప్రయాణం కట్టాల్సిందే.

మాస్క్ ఎవరూ ధరించడంలేదు
——————————————
ఇతరులకు, ఇతరుల నుంచి ఇంకొకరుకు వ్యాప్తి చెందకుండా ఉంచే మార్గాల్లో మాస్కు ధరించడం కీలకమైనది. ఎవరికి మాస్క్ ఉండటం లేదు. గెడ్డనికి పెట్టి యథేచ్ఛగా తిరిగేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ప్రతిఒక్కరూ మాస్కు పెట్టుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నా అమలు కావడం లేదు.

భౌతిక దూరం అంటే ఏమిటి …
——————————————
కరోనాను ఎదుర్కోనేందుకు దగ్గరున్న మరో ఆయుధం భౌతిక దూరం. అంటే ఏమిటి అనేది మండపేట లో వేధించే ప్రశ్న. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి కనీసం ఆరు అడుగులు లేదా 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఇదెక్కడా కనిపించదు. పైగా గుంపులు దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయల మార్కెట్‌లోను, కిరాణా షాపులు, మెడికల్ షాపులకు  ఆఫీసల్లో  ప్రయాణల్లో ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతంల్లో సామాజిక దూరం అస్సలు ఉండటం లేదు.

రద్దీ ప్రాంతాలు… వైరస్ అడ్డాలు…
———————————————
మండపేటలో టిఫిన్, టీ, ఫ్రూట్ జ్యూస్ సెంటర్ల దగ్గర ఎప్పటిలాగే రద్దీ ఉంటోంది. ఎక్కడా కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు పెట్టుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫ్యాషన్ గా మాస్కులు గొంతులకు తగిలించుకుని నిర్లక్ష్యంగా తిరుగు తున్నారు. టీ, చాట్ మసాలాలు, బిర్యానీలు 24 గంటల సర్వీస్ మండపేట స్పెషాలిటీ. కరోనాకి ఎవరూ అతీతులు కాదు. రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రాలేదని ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే అది ఎంత ప్రమాదమో ఒకసారి తెలిసిందే. ఇప్పుడు మండపేటలో బాధ్యతా రాహిత్యాన్ని, విచ్చల విడితనాన్ని చూసి సమాజం సిగ్గు పడుతుంది. ఇప్పుడిప్పుడే కరోనా రెండో దశ తగ్గుతూ ఉన్న నేపథ్యంలో మండపేటలో కరోనాకు బీజాలు పడ్డాయి. ఇది ఎలాంటి పరిమాణాలు దారి తీస్తుందోననే భయం సర్వత్రా నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *