శంఖవరం – జనాసవార్త
———————————-
ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోనీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం పనులను ఆ పధకం తూర్పు గోదావరి జిల్లా అంబుడ్స్ మన్ అధికారిణి ఎం.జ్యోతి గురువారం పరిశీలించారు. శంఖవరంలోని జట్లా వారి చెరువు, నెల్లిపూడి మర్రి చెరువు, కత్తిపూడిలోని ఒడ్డు చెరువులో జరుగుతున్న ఉఫాధి పనులను ఆమె స్వయంగా పరిశీలించారు. మూడు చోట్లా కూలీలను ఆమె సమావేశ పరచారు. పనుల నిర్వహణపై వారితో ఆమె మాట్లాడారు. కూలీలంతా ప్రతీ రోజూ నిర్ణీత పని వేళల సమయాలను ఖచ్చితంగా పాటించాలని, కూలీలకు రోజు వారీ నిర్దేశించిన కొలతల ప్రకారం పని చేసి పూర్తి వేతనం పొందాలని ఆమె కూలీలకు సూచించారు. ఆమె వెంట మండల ఉపాధి హామీ ఏపీఓ. డి.రాజగోపాల్, సాంకేతిక సహాయకులు వి.కార్తీక్ బాబు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *