యస్.రాయవరం – జనాసవార్త
———————————————–
యస్.రాయవరం చీటి పాట బాధితులకు తగు న్యాయం చేస్తానని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అభయం ఇచ్చారు. దీంతో బాధితులు కొంత ఊరట చెందారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని
మండల కేంద్రమైన యస్.రాయవరంలోని చీటి పాట నిర్వాహకుడు కర్రి నాగేశ్వరరావు (నాగు) అకాల మృతితో రోడ్డున పడ్డ భాదితులు అందరూ మద్దాల అప్పారావు, దుబాసి గణేష్, రాయవరపు సాయిరాం, సకలా నానాజీ ఆధ్వర్యంలో శనివారం పాయకరావుపేట ఎమ్మెల్యేను కొరుప్రోలు క్యాంప్ కార్యాలయంలో కలిసి తమ గోడును విన్నవించు కున్నారు. కర్రి నాగు వలన తమకు అన్యాయం జరిగిందని, అతని భార్య వీర నాగమణి బాకీలు ఎగొట్టాలన్న దురుద్దేశంతో నాగు పేరున ఉన్న ఆస్తులను తన వదిన పేరున మార్పే ప్రయత్నాన్ని ఆపడం, నాగు, ఇతని భార్య పేరున ఉన్న ఆస్తుల వివరాలు, బాధితులకు డబ్బు ఎగ్గొట్టే ప్రయత్నాలనూ వివరించారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి బొలిశెట్టి గోవిందరావుకు ముఖ్య అనుచరుడిగా నాగు ఉండడంతో కార్యకర్తలమైన మేమందరము నమ్మి చీటీలు కట్టామని, అంతేగాకుండా మాలో ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద కోట్లాది రూపాయలను వడ్డీకి తీసుకొని ఆస్తులు కూడ గట్టుకున్నాడని ఎమ్మెల్యేకు విన్నవించు కున్నారు. నాగు కుటుంబ సభ్యులు గాని, స్థానిక నాయకులు గాని న్యాయo చేస్తారని ఇప్పటి వరకు ఎదురు చూసినా ఎటువంటి బరోసా గాని, హామి దక్కకపోగా ఒక పక్క ఉన్న ఆస్తులను చక్కదిద్దుకొని తట్టా బుట్టా సర్దుకొని తమకు ఎగనామం పెట్టడానికి చూస్తున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో తమరు మమ్ములను ఆదుకోకపోతే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. ఈ వివరాలన్ని సావధానంగా ఆలకించిన ఎమ్మెల్యే బాబురావు తక్షణం పోలీసు, తదితర సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి సోమవారం తనను కలిస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి ఏ విధంగా చేస్తే పూర్తి న్యాయం జరుగుతుందో ఆ విధమైన చర్యలు చేపట్టి తన వంతు న్యాయం చేస్తానని వందలాది మంది తన కార్యకర్త లకు అన్యాయం జరగనివ్వనని స్పష్టమైన హామి ఇచ్చారు. బాదితులు సంతోషం వ్యక్తం చేసి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత నక్కపల్లి సర్కిల్ ఇనస్పెక్టర్ వి.నారాయణరావు కు, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *