* బీజేపీ నేత శింగిలిదేవి సత్తిరాజు

సి.రాయవరం – జనాసవార్త
————————————–
దేశంలోని రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికీ జూలై నుంచి నవంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసే గరీబ్ కల్యాణ్ యోజన పధకం పేదలకు మరింత ప్రయోజనం కాగలదని తూర్పు గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి శింగిలిదేవి సత్తిరాజు తన ఆశా భావాన్ని వ్యక్తం చేసారు. ఈ పధకం దేశంలోని పేదలు అందరికీ ఈ కరోనా కష్ట కాలంలో నిజంగా ఊరట కలిగిస్తుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేసారు.
పార్టీ ఓబిసి మోర్చా మండల కమిటీల నియమకాల గురించి ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సి.రాయవరం గ్రామంలో
ఏలేశ్వరం రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు ఏనుగు ధర్మరాజు ఆద్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సంధర్భంగా సత్తిరాజు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికే దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత బియ్యం పధకానికి అదనంగా కేంద్రప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజన పధకం ఉచిత బియ్యం పంపీణీ అదనమని ఆయన వెల్లడించారు. ఈ గరీబ్ కల్యాణ్ యోజన పధకం ఉచిత బియ్యం పంపిణీ నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలిపారు అన్నారు. ఈ పధకంలో
ఒక్కో వ్యక్తికి నెలకు 5 కేజీల బియ్యం చొప్పున ఉచితంగా లభిస్తాయని ఆయన వివరించారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశంలోని 81 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనుంది అని ఆయన తెలిపారు. దీని వల్ల భారత సర్కార్‌ కు రూ.67,000 కోట్లకు పైగా అదనపు వ్యయం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా బియ్యం కార్డు కలిగిన వారికి నవంబర్ వరకూ రాష్ట్ర ప్రభుత్వం వాటా బియ్యానికి తోడుగా అటు కేంద్ర ప్రభుత్వం వాటా బియ్యం రెండూ కలిసి వస్తాయని తూర్పు గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి శింగిలిదేవి సత్తిరాజు తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో బిసి మోర్ఛా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండేటి గంగాధర్, వేగు భద్రం, గంటసాల గోవింద రాజు, మదినే బాబ్జీ, పలివెల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *