అన్నవరం – జనాసవార్త
———————————
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం
శంఖవరం మండలంలోని అన్నవరం గ్రామ పంచాయితీ పరిధిలోని సచివాలయం 3 వలంటీరు జి.అఖిల్ కుమార్ పై తొలగింపు వేటు పడింది. ఈ మేరకు మండల పరిషత్తు అభివృద్ధి అధికారి జాగరపు రాంబాబు ఉత్తర్వులను జారీ చేసారు. విధుల్లో నిర్లక్ష్యం, కోవిడ్ ఫీవర్ సర్వే విధులు నిర్వహించకపోవుట, తరచూ విధులకు గైర్హాజరు కావడం, షోకాజు నోటీసు తీసుకొనక పోవడం, సదరు గ్రామ వాలంటీరును అనేక పర్యాయాలు హెచ్చరించినా పై అధికారుల మాటను పెడచెవిన పెట్టడం, అత్యవసర విధులకు అంతరాయం కలిగించడం తదితర కారణాల వల్ల జి.అఖిల్ కుమార్ ను విధుల నుంచి తొలగించినట్టు ఎంపీడీవో రాంబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలం మొత్తం మీద విధుల్లో నిర్లక్ష్యం కారణంగా 25 మంది వలంటీర్లకు తొలుత షోకాజ్ నోటీసులను జారీ చేసిన పిదప వారిలో ఒక్కరిని తొలగించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *