* ఫింఛన్లలో అనర్హులపై ప్రభుత్వం దృష్టి
* 1,00,000 మంది ఫించన్ మహిళలకు నోటీసులు
* 6,000 మంది అనర్హుల గుర్తింపు

తాడేపల్లి – జనాసవార్త
———————————-
ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒంటరి మహిళలకు షాక్ ఇచ్చింది … ఒంటరి మహిళ మహిళ ఫింఛను పధకంలో లబ్ది పొందుతున్న లక్ష మందికి పైగా నోటీసులను జారీ చేసింది…. వారిలో ఇప్పటి వరకూ 6,000 మందికి ఫింఛనును నిలపి వేసింది… వితంతువులు, ఒంటరి మహిళకు ఇచ్చే ఫింఛన్లలో అనేక అవకతవకలు జరుగు తున్నాయన్న ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టింది.

రాష్ట్ర వ్యాప్తంగా వితంతు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లపై ప్రభుత్వం తనిఖీ చేపట్టింది. ఈ రెండు కేటగిరీల్లో పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల రేషన్, ఆధార్‌ కార్డులను పరిశీలించగా సుమారు లక్ష మందికి పైగా వివరాల్లో మార్పులు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో క్షేత్ర స్థాయిలో మరోసారి పరిశీలన జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 6,000 మందిని అనర్హులుగా తేల్చారు. వీరికి జులై 1న ఇవ్వబోయే పెన్షన్ నిలిచిపోనుంది. నోటీసులు అందుకున్న లక్ష మందికిపైగా లబ్ధిదారుల్లో సరైన ధ్రువపత్రాలను సమర్పించిన వారికే జులై 1న ఫించన్లు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.

కర్నూలు జిల్లాలో 11,000 మందికి, కృష్ణాలో 14,000 మందికి, విజయనగరంలో 8,000 మందికి, చిత్తూరు జిల్లాలో 16,000 మందికి నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 80,000 మందికి పైగా లబ్ధిదారుల వివరాల పరిశీలన పూర్తయింది. వీరిలో 6,000 మంది వరకు అనర్హులున్నట్లు పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) అధికారులు గుర్తించారు. చాలా మహిళలు ఒంటరి వారు కాకున్నా ఆ కేటగిరీలో ఫించనాలను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 30 వరకు తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని, అప్పటికీ పరిశీలన పూర్తి కాని వారి పెన్షన్లు ఆపేస్తామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన వారు జులై 15శలోగా సరైన వివరాలు అందిస్తే రెండు నెలలది కలిపి ఒకే సారి ఆగస్టు 1న అందిస్తారు.

వితంతు పెన్షన్ పొందుతున్నా బియ్యం కార్డులో భర్త పేరు ఉండటం, భర్త పేరు స్థానంలో కుమారుడి పేరు నమోదై ఉండటం, ఈకేవైసీలో లింగం తప్పుగా నమోదై ఉండటం, ఒంటరి మహిళలకు సంబంధించి సరైన ధ్రువ పత్రాలు అందించక పోవడం, ఇంకొన్ని చోట్ల ఫింఛను పొందుతున్న మహిళలు పురుషులుగా నమోదై ఉండటం, ఆధార్‌ కార్డుల్లో మార్పులు, తదితర కారణాలతో లబ్ధిదారులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వీటికి సంబంధించి సరైన ధ్రువపత్రాలు అందించకపోతే వచ్చే నెల నుంచి ఫించను నిలిపేస్తామని ఆ నోటీసుల్లో హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *