గుర్రాజుపేట – జనాసవార్త

విశాఖపట్నం జిల్లా యస్.రాయవరం మండలం గుడివాడ గ్రామ రెవిన్యూ గుర్రాజుపేట గ్రామంలో పాస్ బుక్స్, రిజిస్టర్ డాకుమెంట్స్ ఉండి తన స్వాధీన హక్కు భుక్తమైన భూమిపై కన్నేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి కొర్ని వరప్రసాద్ రాత్రికి రాత్రి షెడ్, కొబ్బరి మొక్కలు నాటి ఉన్న పంట పాడుచేసి దురాక్రమణకు పాల్పడుతున్నాడని ఈగల బంగారు పాప పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఇరు వర్గాలను విచారించి వరప్రసాద్ పై కేసు నమోదు చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే. గత నెల రోజుల నుండి వివాదం జరుగు తున్నందున బుధవారం తహశీల్దారు బి.సత్యనారాయణ, ఎస్.ఐ వి.చక్రధర రావు స్వయంగా పరిశీలించి విచారణ చేశారు.

మునుపు ఏం జరిగిందంటే….

తేదీ 25.01.1994 న అప్పయమ్మ తన కుమార్తె బంగారుపాప పేరున పల్లం ఎకరా 1.00 భూమి సర్వే నెంబర్ 201-1 లో 0.25 సెంట్లు, 201-3 లో 0.25 సెంట్లు, 202-9 లో 0.25 సెంట్లు, 202-12 లో వెరసి మొత్తం ఎకరా1.00 గుడివాడ గ్రామస్తురాలైన గొంప అప్పారావు భార్య సింహాచలం వద్ద నక్కపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్ 60/1994 గా బంగారుపాప పేరున కొనుగోలు చేసినది. ఈ భూమి బంగారుపాప పేరున ఖాతా నెంబర్ 1,169 గా రెవిన్యూ రికార్డులలో కూడా నమోదు చేసి, పాస్ బుక్స్, టైటిల్ డీడ్ నెంబర్ 592685 గా రెవిన్యూ అధికారులు ఇచ్చారు. ఇదే గ్రామానికి చెందిన బంగారు పాప తల్లి స్వయానా సోదరుడైన కొర్ని అప్పారావు కుమారుడు బంగారుపాప మేనమామ కుమారుడు అయిన కొర్ని వరప్రసాద్ కాకినాడ టౌన్ కోర్టు కాంప్లెక్స్ లో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేయుచూ, ఈమె భూమిపై కన్ను పడి దూరాశతో అక్రమ మార్గం లో
పొందడానికి 25.05.2021 రాత్రికి రాత్రి వరప్రసాద్ తిరిగి షెడ్, కొబ్బరి మొక్కలు వేసి ఉన్న పంటను పాడు చేసి దౌర్జన్యంగా ఆక్రమణకు ప్రయత్నించడంతో యస్.రాయవరం పోలీసులకు బంగారుపాప పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన చక్రధరరావు సెక్షన్ 447 ఇతరుల ఆస్తులలోఅక్రమ ప్రవేశం, సెక్షన్ 427 ఇతరుల ఆస్తులను పాడుచయడం రెండు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. వరప్రసాద్ పై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసినా తిరిగి అదే రాత్రి షెడ్ కు ప్లాస్టింగ్ చేయించి, పొలంలో పైపులైన్లు వేయడం పై తిరిగి పోలీసులకు, స్పందనలో తహశీల్దారు కు పిర్యాదు చేసినది. పోలీసులు ఇరుపార్టీలపై సెక్షన్ 107 బైoడోవేర్ కేసు ను తహశీల్దార్ కు పంపగా బైండోవర్ చేయడం జరిగింది.

అదే విధంగా కొర్ని వరప్రసాద్ దుశ్చర్యలు, అలాగే ఇతని స్వయానా పెదనాన్న కుమారుడు కొర్ని రాజా రమేష్ పాల్పడుతున్న చర్యలను వ్రాతపూర్వకంగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సంఘం కు పిర్యాదు చేయగా బహిరంగ విచారణ చేసి అక్రమాలకు పాల్పడుతున్న ఇరువురను హెచ్చరించారని బాధితురాలు ఈగల బంగారుపాప విలేకరులకు తెలిపింది. సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇసరపు శేఖర్ యాదవ్, జనరల్ సెక్రటరీ కారుకొండ వీరేoద్ర యాదవ్, బహిరంగ విచారణ చేసి నిజ నిద్దారణ చేసుకొని బాధితురాలు కు న్యాయం జరిగే వరకు సంఘం తరుపున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించగా న్యాయం చేస్తామని హామి ఇచ్చారని తెలిపారు. ఇన్ని విధాలుగా ఉన్నా వరప్రసాద్ పొలంలో పనులు చేయడం ఆపకపోవడంతో తహశీల్దారు, ఎస్ఐ లు బుధవారం వెళ్లి సర్వే చేయించి సమీప రైతుల వద్ద స్టేట్మెంట్లు తీసుకొని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్, విఆర్వో, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *