కడియపులంక – జనాసవార్త

మహిళలకు దిశ యాప్ కొండంత అండగా ఉంటుందని ఆంధ్రప్రదచశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పి.పుష్ప శ్రీవాణి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని గంగుమళ్ల సత్యనారాయణ నర్సరీని ఆమె గురువారం సందర్శించారు. విజయవాడ నుంచి ఆమె నియోజకవర్గమైన విశాఖ జిల్లా కురుపాం నకు వెళుతూ మార్గ మధ్యంలో ఈ నర్సరీని తిలకించారు. ఈ సందర్భంగా ఆమెను కలసిన మీడియాతో మాట్లాడుతూ దిశ యాప్ ను అమ్మాయిలు తప్పని సరిగా డౌన్ లోడ్ చేసుకోవాలి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడు తున్నారు అన్నారు. ఇప్పటికే ఈ యాప్ ద్వారా అనేక మంది రక్షణ పొందారు అన్నారు. కడియం ప్రాంత నర్సరీల అందాలు ఎంతో అధ్బుతంగా ఉంటాయన్నారు. తనకు మొక్కలు అంటే చాలా ఇష్టమని అందుకునే తరుచూ ఈ నర్సరీలకు వస్తుంటానని మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. పలు రకాల మొక్కలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఆమెకు గంగుమళ్ల నర్సరీ మేనేజర్ సూర్యనారాయణ రెడ్డి మొక్కను బహూకరించి స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *