విశాఖపట్నం – జనాసవార్త

విశాఖ సాక్షి బ్యూరో చీఫ్ గా గరికిపాటి ఉమాకాంత్ ఉత్తమ వార్తా కధనాలను అందించడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారని విశాఖ కేంద్రంగా వెలువడుతున్న సంచలన వార్తా పత్రిక లీడర్ పత్రిక సంపాదకులు వివి.రమణమూర్తి కొనియాడారు. విశాఖపట్నం సాక్షి నుండి తిరుపతి సాక్షికి ఉమాకాంత్
బదిలీ అయిన సందర్భంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సాక్షి బ్యూరో చీఫ్ ఉమాకాంత్ ను
గురువారం ఘనంగా సత్కరించారు. విజెఎఫ్. పాలక వర్గం ఆయనకు శాలువాను కప్పి, జ్ఞాపికలను అందజేశారు. ఈ ఉద్యోగ బదిలీ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రమణమూర్తి మాట్లాడారు. ఉమాకాంత్ విశాఖలో అడుగు పెట్టింది మొదలు ప్రజా సమస్యలపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అనేక వార్తలు వ్రాసి మన్నలను పొందారన్నారు. ప్రజలకు ఇటు పార్టీకి చక్రంలా పనిచేయడం సామాన్య విషయం కాదన్నారు. ఎంతో సున్నితమైన, కల్మషం లేని ఉమాకాంత్ మరింత ఉన్నత పదవిలో మళ్ళీ త్వరలోనే విశాఖకు రావాలని ఆకాంక్షించారు. వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, అందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని విజిఎఫ్ కుటుంబంలో సభ్యుడిగా కలిసి ఐదేళ్ళు గడిచాయన్నారు. విశాఖ అప్పన్న పాదాల చెంత నుండి తిరుపతి వెంకన్న పాదాల చింతకు బదిలీ కావడం ఆనందంగా ఉందన్నారు. ఆయన రాసిన వార్తలు పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది అని కొనియాడారు. సన్మాన గ్రహీత, సాక్షి బ్యూరో చీఫ్ ఉమాకాంత్ మాట్లాడుతూ తన 27ఏళ్ల జర్నలిజంలో ఎక్కువ కాలం పని చేసింది వైజాగ్ లోనే అన్నారు. అనేక జిల్లాల్లో పని చేసిన తనకు ఐదేళ్ల క్రితం వైజాగ్ కు ట్రాన్స్ఫర్ అయిందన్నారు. కానీ ఇక్కడికి ఇష్టపడి రాలేదని, వైజాగ్ కు తన బదిలీలోనే తన తండ్రి చనిపోయారు అని చేదు జ్ఞాపకాన్ని ఉమాకాంత్ గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు విశాఖను తాను వదిలి వెళ్లడం తనకు చాలా బాధ కలిగిస్తుందన్నారు. విశాఖలో అడుగు పెట్టిన మొదటి రోజే యుగంధర్ రెడ్డి, మీడియా లెజెండ్ రమణ మూర్తిని కలిసా నన్నారు. అలాగే వీజేఎఫ్ తో కూడా మంచి తత్స సంబంధాలు ఏర్పడ్డాయి అన్నారు. తను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ఉమాకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, డాక్టర్ రామ్ కుమార్, వీజేఎఫ్ కార్యదర్శి చోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, ఈరోతి ఈశ్వర్ రావు, ఎమ్మెస్సార్ ప్రసాద్, పైల దివాకర్, మాధవ్, గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *