* భాదితులు నుండి వివరాలు సేకరణ.
* చీటీల నిర్వాహక కుటుంబ సభ్యులపై విచారణ

యస్.రాయవరం – జనాసవార్త

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని మండల కేంద్రమైన యస్.రాయవరం గ్రామంలోని అనధికారిక చీటి పాటలు నిర్వాహకుడు కర్రి నాగేశ్వరరావు (నాగు) కరోనాతో మరణించడంతో చీటి పాటదారులకు సదరు సొమ్ములను తిరిగి చెల్లించడానికి మృతుని భార్య ముఖం చాటేయడంతో నమోదైన కేసులో పోలీసులు విచారణ మొదలెట్టారు. భాదితులు తమ సొమ్ము ఇవ్వాలని నాగు భార్యను ఇతర కుటుంబ సభ్యులను అడుగగా సరైన సమాధానం రాకపోగా సమావేశాలంటూ భాదితులను నమ్మిస్తూ ఎగనామం పెట్టే విధంగా నాగు పేరున ఉన్న ఆస్తులను తన బంధువు పేరున మార్చుకోవడానికి ప్రయత్నం చేయగా భాదితులు నక్కపల్లి రిజిస్టర్ కార్యాలయంలో అడ్డుకొన్నారు. దీనితో తమకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని స్థానిక ఎమ్మెల్యే బాబూరావును భాదితులు కొంత మంది వెళ్లి కలిసి తమ గోడు విన్నవించు కోగా న్యాయం చేస్తానని పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న సూచనతో ఆ ప్రకారం చేసారు. భాదితులు వద్ద వివరాలు సేకరించుకొని, నాగు కుటుంబ సభ్యుల నుండి పూర్తి వివరాలు, ఆస్తుల వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. నక్కపల్లి సర్కిల్ ఇనస్పెక్టర్ వంపూరి నారాయణరావు, యస్.రాయవరం ఎస్.ఐ వి.చక్రధరరావు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని భాదితులకు న్యాయం చేయడానికి వడి వడిగా చర్యలు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *