రావులపాలెం – జనాస వార్త
శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన పుష్పం బ్రహ్మ కమలం … ఇవి ఉత్తరాఖండ్ తదితర శీతల ప్రాంతాల్లో మాత్రమే బహు అరుదుగా కనిపిస్తాయి. అయితే ఈ అరుదైన బ్రహ్మ కమలాలు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శుక్రవారం రాత్రి వికసించాయి. స్థానిక స్వగృహ అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్న పెరట్లో పెంచుతున్న ఈ అరుదైన మొక్కకు పది రోజుల క్రితం నాలుగు మొగ్గలు పూసాయి. వాటిలో రెండు శుక్రవారం రాత్రి నుంచి వికసిస్తున్నాయి. ఏడాదిలో ఒకసారి అది కూడా రాత్రి వేళల్లో మాత్రమే పూసే ఈ పువ్వులు శ్వేత వర్ణంలో పెద్దగా వికసిస్తాయి. రాత్రి వేళల్లో కొద్ది గంటల పాటు మాత్రమే వికసించి, అందాలొలికించి ఉదయానికి మొగ్గలా ముడుచుకుని పోతాయి. ఆకుల నుంచి మొగ్గలు వస్తాయి. అవి పదిహేను రోజుల్లో పొడవాటి కాడలతో పెద్దగా ఎదిగి వికసిస్తాయి. ఈ పూలు చాలా అందంగా ఉంటాయి అని పుష్ప పురాణాలు చెబుతున్నాయి. దీంతో ‌ఈ పూలను చూసేందుకు స్థానికులు తరలి వచ్చారు. దీంతో ఇక్కడ సందర్శకుల సందడి నెలకొంది. మమదీంతో నరసింషహారావు కుటుంబ సభ్యులు మొక్కకు పూజలు నిర్వహించారు. శనివారం స్థానిక శివాలయంలో స్వామి వారికి సమర్పిస్తామని ధర్మరాజు నరసింహారావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *