* విఆర్ఓ ఫోర్జరీ సంతకం

* నకిలీ రబ్బరు స్టాంప్, రికార్డులు పునఃసృష్టి 
* అసలుకు బదులు తప్పుడు సర్వే నెంబర్ తో అమ్మకాలు.

గుర్రాజుపేట – జనాసవార్త
————————————
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం మండలం గుడివాడ రెవిన్యూ గుర్రాజుపేట పంచాయతీలో 123-1,123-2, 123-4  సర్వే నెంబర్లలోని బంగారుపాపకు చెందిన ఎకరం భూమిని కొర్ని రాజా రమేష్ దురాక్రమణ చేస్తూ, అధికారుల ఫోర్జరీ సంతకాలతో రికార్డులు సృష్టించి ఈ భూమిలో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్ ను వేరే సర్వే నెం.125/2 గా తెలిపి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి క్రయ దస్తావేజ్ చేసినందున విచారించి తనకు న్యాయం చెయ్యాలని కోరుచూ తహశీల్దారు, యస్.ఐలకు శనివారం ఫిర్యాదు చేసారు.

గుర్రాజుపేట గ్రామస్తుడు కొర్ని పెదఅప్పన్న తండ్రి బుచ్చన్న గుడివాడ రెవిన్యూ గుర్రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్లు 123-1,123-2, 123-4 లో ఎకరా 1.10 సెంట్లు భూమి డాక్ మెంట్ నెం.198 ఆఫ్ 1967 గా కొనుగోలు చేశారు. కొర్ని పెదఅప్పన్న మరణానంతరం ఇతని భార్య, తన కుమార్తె పక్కుర్తి అప్పయమ్మ భర్త అప్పారావుకు తన ముగ్గురు కుమారులు బుచ్చన్న అనే రాజశేఖర్, అప్పారావు, నూకరాజు నలుగురు కలిపి సర్వే నెoబర్లు 123-1,123-2, 123-3 లో ఎకరం భూమిని తేదీ 14.10.1985 న నక్కపల్లి రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసారు. పక్కుర్తి అప్పయమ్మ తేదీ 01.12.2001 న మరణించగా ఈమె వారసురాలు అయిన ఏకైక కుమార్తె ఈగల బంగారుపాప భర్త నాగేశ్వర రావుతో కలిసి యూకలిప్టస్ తోట వేసుకొని అప్పటి నుండి అనుభవిస్తున్నారు. కొర్ని బుచ్చన్న అనే రాజశేఖర్ కుమారుడైన కొర్ని రాజా రమేష్ గ్రామానికి ఆనుకొని ఉన్న ఈ విలువైన భూమిని 2015 లో రాత్రికి రాత్రే రేకుల షెడ్ వేసి ఆక్రమించాడు. దీనితో భూయజమానురాలైన ఈగల బంగారుపాప పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రాజా రమేష్ పై కేసు నమోదు (ఎఫ్.ఐ.ఆర్ నెం.43/15 తేదీ 15.04.2021) చేసారు. దీనితో రాజా రమేష్ ఎలమంచిలి కోర్టులో కేసు వేయగా ప్రస్తుతం నడుస్తున్నది.

ఇది ఇలా ఉండగా ఈ భూమికి పాస్ బుక్స్ కొరకు ఎప్పటి నుండో రెవిన్యూ అధికారుల చుట్టూ బంగారుపాప తిరుగుతుండగా ఈ భూమిని ఇళ్ల పట్టాల కొరకు ప్రభుత్వం తీసుకున్నదని రెవెన్యూ అధికారులు తెలుపు తున్నారు. జిరాయితీ భూమిని ఇళ్ల పట్టాల కొరకు ప్రభుత్వం తీసుకుని ఉంటే భూమి యజమానులకు పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని, ఆది నుండి ఇది ప్రభుత్వ భూమిగాఉంటే రెండు పర్యాయాలు కొనుగోలు రిజిస్ట్రేషన్ ఏవిధంగా జరిగిందని బంగారుపాప ప్రశ్నిస్తున్నారు. ఈ ఎకరా భూమి ప్రస్తుతం1బి లో ప్రభుత్వ చెరువు భూమి గాను, రెవిన్యూ ఫైనల్ గజిట్ 2018, 22ఎ ప్రకారం ఎస్.డబ్ల్యు,(ఎల్.ఏ), బి.సి.కాలనీకి చెందిన ప్రభుత్వ భూమి గాను వేరు, వేరుగా చూపడంలో ఉన్న మతలబు రెవిన్యూ అధికారులే తెలపవలసి ఉన్నది.
కొర్ని రాజా రమేష్ ఈ భూమిలో దౌర్జన్యంతో అక్రమంగా ఇళ్ళు నిర్మాణం చేస్తున్నాడు.

వ్యాజ్యం కోర్టులో ఉన్నప్పటికీ కొర్ని రాజారమేష్ తమ భూమిని అమ్ముకుంటున్నాడని, మిగిలిన స్థలములో కొద్ధి భాగం కొర్ని తాతబ్బాయికి అమ్మగా అతడు ఇంటి నిర్మాణంకు పునాదులు తీస్తుండగా, ఈగల బంగారుపాప పోలీసు ఎస్.ఐ, వి.చక్రధరరావుకు ఇటీవల ఫిర్యాదు చేసారు. ఆయన దీనిపై రికార్డుల వివవరణ కోరుతూ తహశీల్దార్ బి.సత్యనారాయణకు లేఖ రాసారు. ఈ నేపధ్యంలో రికార్డులను పరిశీలిస్తు ఉన్నామని, ప్రస్తుతం ఎవ్వరూ ఈ భూమిలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఇరు వర్గాలనూ
తాహశీల్దార్ ఆదేశించారు. రికార్డుల ప్రకారం అక్రమ నిర్మాణాలని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తాహశీల్దార్ తెలుపు తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *